Madrasa survey in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మదర్సాలపై సర్వే చేపట్టింది. ముఖ్యంగా రాష్ట్రప్రభుత్వం గుర్తించని మదర్సాల విషయంలో కఠినంగా వ్యవహరించనుంది ప్రభుత్వం. ఇదిలా ఉంటే కొన్ని రాజకీయ పక్షాల నుంచి దీనిపై అభ్యంతరం వచ్చింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈ సర్వేను మినీ ఎన్నార్సీగా అభివర్ణించారు. అయితే గుర్తింపులేని మదర్సాల సర్వే విషయంలో మాకు ఏం అభ్యంతరం లేదని జమియత్ ఉలామా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ ఆదివారం తెలిపారు. మదర్సాల సర్వేపై మాకు అభ్యంతరం లేదని.. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఉలేమాలు సమాధానం ఇవ్వాలని.. ప్రజలు సర్వేకు పూర్తిగా సహకరించాలని మదానీ అన్నారు.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్‌లో సినిమా థియేటర్లు ప్రారంభం.. 1990 తర్వాత ఇప్పుడే తొలిసారి
దారుల్ ఉలూమ్, దేవ్‌బంద్‌లో మదర్సాల సమ్మేళంన జరిగిన వెంటనే ఈ ప్రకటన రావడం గమనార్హం. సర్వే విషయంలో మాకు ఎలాంటి వ్యతిరేకత లేదని మదానీ అన్నారు. మదర్సాలు తమ నిబంధనలను, ఖాతాలను సక్రమంగా ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. సర్వేపై ముస్లిం సమాజంలో ఎలాంటి ఆగ్రహం లేదని.. ముస్లింల విరాళాలతో మదర్సాలను నడుపుతున్నామని.. ఏదైనా మదర్సాలో పిల్లలపై అఘాయిత్యాలు జరిగితే తనిఖీ చేయవచ్చని.. వ్యతిరేకంగా ఏ సమాచారం దొరికినా.. దాన్ని మూసేవచ్చని ఆయన అన్నారు.
ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించని మదర్సాల సర్వేపై ఉత్తర్ ప్రదేశ్ లో మదర్సాల సమ్మేళనం జరిగింది. దీనికి 250 మందికిపైగా మదర్సాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నెల ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం 12 అంశాల ఆధారంగా సర్వే చేపట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠ్యాంశాలు, ప్రభుత్వేతర సంస్థలతో మదర్సాల అనుబంధం గురించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు మదర్సాల సర్వేను చేపట్టింది ప్రభుత్వం. అయితే ఈ చర్యలను అసద్దుదీన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాలు చేపడుతున్న మదర్సాల సర్వే ముస్లిం సమాజంపై దాడిగా ఆయన అభివర్ణించారు. దీన్ని మినీ ఎన్సార్సీ అని అన్నారు.