ఓ యువకుడు ఓ యువతిని పదే పదే వేధిస్తుండడంతో ఆమె పంచాయతీని ఆశ్రయించింది.. అక్కడ వారు ఇచ్చిన తీర్పుతో ఆ యువతి అందరూ చూస్తుండగా చెప్పుతో కొట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో అందరూ చూస్తుండగా.. ఓ యువతి యువకుడిని చెప్పుతో కొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ వ్యక్తి యువతిని పదే పదే వేధిస్తుండడంతో ఆమె పంచాయతీ పెద్దల వద్దకు వెళ్లి.. విషయాన్ని చెప్పింది. దీంతో పంచాయతీ పెద్ద మనుషులంతా కలిసి ఓ తీర్పు ఇచ్చారు. అందరూ చూస్తుండగా యువకుడిని చెప్పుతో కొట్టమని విన్నూతంగా ఓ తీర్పు చెప్పారు. వెంటనే యువతిని తన కాలికున్న చెప్పును తీసుకుని ఆ యువకుడిని పదే పదే కొట్టింది. జనమంతా చూస్తుండగా ఆ వ్యక్తిని చెప్పుతో పలుమార్లు కొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో పంచాయతీ తీర్పుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏడాది జూన్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూడా ఇలాంటి తరహా సంఘటన జరిగింది. ఒడిశాలోని బెహ్రాంపూర్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు, తమను వేధిస్తున్న వ్యక్తిని బహిరంగంగా కొట్టారు. స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఆ బాలికలు అంతా చూస్తుండగా ఒక వ్యక్తిని బెల్ట్‌తో చితకబాదారు. ఈ వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Chappal kalesh b/w a Girl and a Guy over Harrasingg and Mosbehaving with the girl in Hapur,UP pic.twitter.com/cSx7sAkvW3
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 17, 2023