Site icon NTV Telugu

Uttar Pradesh: కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్‌లో భోజనం.. యోగి ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు

Uttar Pradesh

Uttar Pradesh

Food served to kabaddi players in the toilet: ఉత్తర్ ప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్లలో ఆహారం అందిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబర్ 16న సహరాన్ పూర్ బాలికల అండర్ -17 రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొంతమంది దీన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మరుగుదొడ్డిలా కనిపించే ప్రాంతంలో విద్యార్థినిలు అన్నం, కూరలు వడ్డించుకుంటున్నట్టు వీడియోలో ఉంది. ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోలో యూరినల్స్, వాష్ బేషన్, టాయిలెట్ ఫ్లోర్ లో ఉంచిన రైస్ ప్లేట్ ను గమనించవచ్చు. ఈ ఘటనపై రాష్ట్రప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సహరాన్‌పూర్ స్పోర్ట్స్ ఆఫీసర్ అనిమేష్ సక్సేనాను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

Read Also: Tension in Shamshabad: శంషాబాద్ లో ఉద్రిక్తత.. వైద్యం వికఠించి వ్యక్తి మృతి బంధువులు ఆందోళన

వర్షం కురుస్తున్న సమయంలో స్మిమ్మింగ్ పూల్ ఏరియాలో ఫుడ్ ఏర్పాట్లను చేశామని.. స్మిమ్మింగ్ పూల్ పక్కనే బట్టలు మార్చుకునే గదిలో ఆహార పదార్థాలను పెట్టామని.. స్టేడియంలో అక్కడక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. వర్షం కారణంగా ఆహారాన్ని ఉంచే స్థలం లేకపోవడంతో ఇలా చేశామని సస్పెండ్ అయిన అధికారి సక్సేనా వెల్లడించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఈ ఘటన రాజకీయంగా వివాదాస్పదం అయింది. కబడ్డీ ఆటగాళ్లను బీజేపీ అవమానపరిచిందంటూ విపక్షాలు విమర్శలు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆర్జేడీ, టీఆర్ఎస్ వంటి పార్టీలు కూడా బీజేపీపై విమర్శలు గుప్పించాయి. టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి.. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. ఉత్తర్ ప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు అందించే ఆహారాన్ని టాయిలెట్ లో ఉంచారని.. ఆటగాళ్లను బీజేపీ ఇలానే గౌరవిస్తుందా..? సిగ్గు చేసు అంటూ వ్యాఖ్యానించారు. ఆర్జేడీ నేత జయంత్ చౌదరి కూడా ఈ ఘటనపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను ట్వీట్ చేసి ప్రభుత్వంపై విమర్శలు చేసింది.

Exit mobile version