Site icon NTV Telugu

UP Video: రైల్వేట్రాక్‌పై స్లీపింగ్.. మీద నుంచి ట్రైన్ వెళ్లినా..!

Sleepingrailwaytrack

Sleepingrailwaytrack

ఉత్తరప్రదేశ్‌లో ఓ తాగుబోతు రైల్వే అధికారులకు షాకిచ్చాడు. మద్యం మత్తులో రైల్వేట్రాక్‌పైనే నిద్రపోయాడు. ఆ సమయంలో ట్రైన్ కూడా వచ్చేసింది. కానీ ఆ వ్యక్తి ఎలాంటి గాయాలు కాకుండానే క్షేమంగా బయటపడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Viral Video: కామాంధుడి తిక్కకుదిర్చిన అమ్మాయి.. నడిరోడ్డుపై.?

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి రైలు ట్రాక్‌పై నిద్రపోయాడు. రైలు వెళ్లినా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. లోకో పైలట్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ట్రాక్‌పై నిద్రిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చదవండి: Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో ఆకట్టుకోలేకపోయిన తెలుగమ్మాయి..

Exit mobile version