Site icon NTV Telugu

Uttar Pradesh: స్పెల్లింగ్ తప్పు రాశాడని ఉపాధ్యాయుడి దాడి.. దళిత విద్యార్థి మృతి

Uttar Pradesh Incident

Uttar Pradesh Incident

Dalit Student Dies After Alleged Assault By Teacher in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తప్పుగా పదం రాశాడని ఉన్నత కులానికి చెందిన ఉపాధ్యాయుడు దళిత విద్యార్థిని తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ.. విద్యార్థి మరణించారు. ఈ ఘటన ఔరయ్యా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన 15 ఏళ్ల దళిత విద్యార్థి 10 తరగతి చదువుతున్నాడు. విద్యార్థి ఇటీవల పరీక్షలో ఒక పదం తప్పుగా రాశాడనే కారణంతో ఉన్నత కులానికి చెందిన ఉపాధ్యాయుడు తీవ్రంగా దాడి చేశారు. దాడి జరిగిన 19 రోజుల తర్వాత విద్యార్థి మరణించాడు.

Read Also: Ashokan: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

సెప్టెంబర 7న సాంఘిక శాస్త్ర పరీక్షలో ఒక పదాన్ని తప్పుగా రాశాడని నిఖిల్ దోహ్రే అనే బాలుడిని ఉపాధ్యాయుడు అశ్విని సింగ్ తన కుమారుడిపై కర్రలతో, రాడ్ తో దాడి చేశాడని.. స్పృహతప్పి పడిపోయేంత వరకు కొట్టాడని బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడి చికిత్స కోసం ఉపాధ్యాయుడు రూ. 10,000 ఇచ్చారని.. ఆ తరువాత రూ.30,000 ఇచ్చారని.. తనను కులం పేరుతో దూషించాడని బాలుడి తండ్రి చెబుతున్నారు. అయితే శనివారం రాత్రి బాలుడి పరిస్థితి విషమించడంతో ఇటావా జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మరణించాడు.

బాలుడి కొట్టిన తర్వాత అతని వీడియోను కుటుంబం రికార్డ్ చేసింది. అతని కళ్లు ఉబ్బి ఉండటంతో పాటు అతను స్పృహ కోల్పోయి ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు మూడు పోలీస్ టీములను ఏర్పాటు చేశారు. ఎస్టీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు పోలీసులు.

Exit mobile version