Ashokan: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు అశోకన్(60) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1989 లో వర్ణం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఆశోకన్. ఆయన అసలు పేరు రామన్ అశోక్ కుమార్.
మాలీవుడ్ లో కామెడీ చిత్రాలకు పెట్టింది పేరుగా మారిన ఆయన ఎన్నో మంచి చిత్రాలను మలయాళ ఇండస్ట్రీకి అందించారు. ఇక 2003 లో ఆయన దర్శకత్వంలో వచ్చిన కనప్పురమున్ అనే టెలీ చిత్రం ఉత్తమ టెలి చిత్రం రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకొంది. ఇక 2003 తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి సింగపూర్ కు మకాం మార్చారు. అక్కడ కొన్ని వ్యాపారాలు ప్రారంభించిన ఆయన ఇటీవలే చెన్నైకు తిరిగివచ్చారు. ఇక ఆయన కుటుంబం గురించి చెప్పాలంటే.. అశోకన్ కు భార్య, కుమార్తె ఉన్నారు. ఇక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ ఆయన తుదిశ్వాస విడవడం బాధాకరమని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.