Site icon NTV Telugu

USCIRF: యూఎస్ మతస్వేచ్ఛ కమిషన్ కు భారత్ ఘాటు సమాధానం

Arindam Bagchi

Arindam Bagchi

భారత్ లో మతస్వేచ్ఛపై పదేపదే విషాన్ని గుప్పిస్తున్న యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం ( యూఎస్సీఐఆర్ఎఫ్)పై భారత్ ఘాటుగా స్పందించింది. జూలై 2న భారత్ కు వ్యతిరేఖంగా ఈ సంస్థ పలు ట్వీట్లను పెట్టింది. భారత్ లో ప్రశ్నించే గొంతులను, ముఖ్యంగా మైనారిటీల అణచివేత కొనసాగుతోందని.. దీనిపై వారంతా ఆందోళన చెందుతున్నారని ట్వీట్ చేసింది. దీంట్లో ఇటీవల ముంబైకి చెందిన ప్రముఖ ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్ అరెస్ట్ గురించి కూడా కమిషన్ ప్రస్తావించింది.

భారతదేశంలో మానవ హక్కుల న్యాయవాదులు, పాత్రికేయులు, కార్యకర్తలు మతస్వేచ్ఛపై మాట్లాడితే వేధింపులు ఎదుర్కొంటున్నారని.. ఇది ప్రజాస్వామ్య దేశానికి మంచిది కాదంటూ యూఎస్సీఐఆర్ఎఫ్ కమీషనర్ స్టీఫెక్ ష్నేక్ అన్నారు.

Read Also:BJP National Executive Meeting: బీజేపీ స‌భ‌లో ఇటెలిజ‌న్స్ పోలీసుల హ‌ల్ చ‌ల్‌

దీనికి భారత ప్రభుత్వం ఘాటుగానే సమాధానం ఇచ్చింది. విదేశాంగ మంత్రిత్వ అధికార ప్రతినిధిత అరిందమ్ బాగ్చీ స్పందిస్తూ.. యూఎస్ కమీషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడంకి భారత్ గురించ లోతైన అవగాహన లేకపోవడాన్ని ఈ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పక్షపాతంతో కూడినవని సరైనవి కాదని ఘాటుగా బదులిచ్చారు. దురదృష్టవశాత్తూ యూఎస్ కమిషన్ తన ఎజెండాను అనుసరించి పదేపదే తప్పుడు ప్రకటనలు, నివేదికలు ఇస్తుందని అరిందమ్ బాగ్చీ అన్నారు. ఇటువంటి చర్యలు యూఎస్ కమిషన్ పై విశ్వసనీయత, నిష్పాక్షికతను దెబ్బతీస్తాయని ఆయన అన్నారు.

Exit mobile version