NTV Telugu Site icon

Russia- Ukraine War: యుద్ధాన్ని ఆపమని పుతిన్కు చెప్పండి.. భారత్‌కు అమెరికా విజ్ఞప్తి

Russia

Russia

Russia- Ukraine War: రష్యా- ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని తొందరలోనే ముగించేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడాలని భారతదేశానికి అగ్రరాజ్యం అమెరికా కోరింది. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేయాలని తెలిపింది. భారత్- రష్యా బంధం సుదీర్ఘమైనదన్నారు. ఈ క్రమంలో మాస్కో- కైవ్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా భారత్ జోక్యం చేసుకోవాలని యూఎస్ పేర్కొనింది. ఇందుకు తన దీర్ఘకాల సంబంధాన్ని ఉపయోగించుకోవాలని అమెరికా సూచించింది.

Read Also: Raj Tarun: ఎక్కడున్నా మా ముందుకు రావాల్సిందే.. రాజ్ తరుణ్ కు పోలీసుల నోటీసు

ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ.. ఢిల్లీ- మాస్కోల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో అమెరికా చార్టర్‌ను గౌరవించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెప్పాలని అతడు కోరారు. పుతిన్ చట్టవిరుద్ధమైన యుద్ధం చేస్తున్నారని యూఎస్ ప్రతినిధి ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించమని పుతిన్‌కు సూచించాలని మథ్యూ మిల్లర్ చెప్పుకొచ్చారు.

Show comments