NTV Telugu Site icon

Donald Trump: భారతీయులకు ట్రంప్ షాక్.. యూఎస్ నుంచి 18,000 మంది బహిష్కరణ..!

Illegal Indian Migrants In The Us

Illegal Indian Migrants In The Us

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. వచ్చి రావడంతోనే అక్రమ వలసదారుల బహిష్కరణ, జన్మత: పౌరసత్వం(బర్త్‌రైట్ సిటిజన్‌షిప్)పై పని మొదలుపెట్టారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఈ రెండు హామీలపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే వీటిపై ‘‘ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్’’ పాస్ చేశాడు. ఇదిలా ఉంటే, యూఎస్‌లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న తమ పౌరులందరిని గుర్తించి తిరిగి తీసుకునేందుకు భారత ప్రభుత్వం, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది. ట్రంప్ హామీలకు కట్టుబడి ఉండాలని భారత ప్రభుత్వం భావిస్తోందని, ఫలితంగా వాణిజ్య యుద్ధాన్ని నివారించేందు ట్రంప్‌తో సహకరించేందుకు ఇది ముందస్తు సూచన అని నిపుణులు చెబుతున్నారు.

సమాచారం ప్రకారం.. అమెరికాలో 18,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు రెండు దేశాలు గుర్తించాయి. వీరందర్ని త్వరలో భారత్ పంపిచే అవకాశం ఉంది. అయితే, ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని, ఎంత మంది అక్రమ భారతీయ నివాసితులు ఉన్నారనే విషయం ఇంకా స్పష్టంగా తేలలేదని విషయం తెలిసిన వారు చెప్పారు.

Read Also: APSRTC: సంక్రాంతి ‘పండుగ’ చేసుకున్న ఏపీఎస్ఆర్టీసీ.. రికార్డు స్థాయిలో ఆదాయం..

నిజానికి ట్రంప్‌తో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధమైంది. యూఎస్‌తో వాణిజ్య యుద్ధాన్ని నివారించేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌తో పనిచేయడానికి భారత తెరవెనక పనిచేస్తోంది. దీంట్లో భాగంగానే యూఎస్‌లో అక్రమంగా ఉంటున్న భారతీయులను తీసుకునేందుకు భారత్ సిద్ధమైందని సమాచారం. ఈ చర్యల ఫలితంగా యూఎస్‌లోకి సక్రమ మార్గాల ద్వారా ప్రవేశించే, H-1B వీసా కార్యక్రమాన్ని ట్రంప్ ప్రభుత్వం రక్షిస్తుందని భారత్ భావిస్తోంది. అధికార డేటా ప్రకారం.. 2023లో 3.86 లక్షల H-1B వీసాలలో దాదాపు మూడింట మూడు వంతుల మంది భారతీయ పౌరులే.

యుఎస్ కస్టమ్స్ మరియు బోర్డర్ ప్రొటెక్షన్ డేటా 2024 లెక్కల ప్రకారం.. అమెరికా వస్తున్న అక్రమ వలసదారుల్లో భారతీయులు 3 శాతం మంది ఉన్నారు. మెక్సికో, వెనుజులా, గ్వాటెమాల వంటి లాటిన్ దేశాల నుంచి యూఎస్‌కి ఎక్కువ సంఖ్యలో అక్రమ వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర సరిహద్దుల్లో నుంచి భారతీయుల అక్రమ వలసలు ఉన్నాయి. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల వలసదారుల మొత్తం ఖచ్చితంగా తెలియకున్నా.. గతేడాది హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం నివేదిక ప్రకారం.. 2022 నాటికి దాదాపుగా 2,20,00 మంది ఉన్నట్లు అంచనా. అక్టోబర్ నెలలో, అమెరికా నుంచి 100 మందికి పైగా అక్రమ వలసదారుల్ని ఇండియాకు చార్టెడ్ ఫ్లైట్స్‌లో పంపించింది. గత 12 నెలల్లో 1100 మందికి పైగా భారతీయులు బహిష్కరించబడ్డారు.