Site icon NTV Telugu

America: సారీ.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం కుదరదు..

Khalisthan

Khalisthan

America: అమెరికాలోని ఖలిస్థానీ ఉగ్రవాది, సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ చీఫ్ గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్ యొక్క బ్యాంకు వివరాలను భారత్‌కు ఇవ్వడం కుదరదు అని అక్కడి పోలీసులు తెలిపారు. 2020లో పంజాబ్‌లోని మోగా డిస్ట్రిక్ట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసుపై ఖలీస్థానీ పతాకం ఎగరేసింది. ఈ కేసుకు సంబంధించి పన్నూన్ ఫోన్‌ నంబర్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలు ఇవ్వాలని అమెరికాను జాతీయ దర్యాప్తు సంస్థ అభ్యర్థించింది. అయితే, స్థానిక చట్టాలు అందుకు అంగీకరించని తేల్చి చెప్పారు. భారత్‌లో పన్నూన్ పై మోపిన అభియోగాలకు శిక్ష ఏడాది లోపే ఉండటంతో.. రూల్స్ ప్రకారం ఇలాంటి డీటెయిల్స్ అడగకూడదని యూఎస్ అధికారులు చెప్తున్నారు.

Read Also: Bengaluru Techie: పురుషుల రక్షణకు కూడా చట్టాలు కావాలి.. లేదంటే కోర్టులపై నమ్మకం పోతుంది!

అయితే, 2020 ఆగస్టు 14న ఇద్దరు వ్యక్తులు మోగాలోని డిప్యూటీ కమిషనర్‌ ఆఫీస్ కి వచ్చి.. అక్కడ ఉన్న జాతీయ పతాకాన్ని తొలగించి ఖలిస్థానీ జెండాను ప్రదర్శించారు. దీనిపై విచారణ చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. కాగా, వీరు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్ పన్నిన ఉచ్చులో పడ్డారని ఎస్‌ఎస్‌పీ హర్మన్‌బీర్‌ సింగ్‌ గిల్‌ ప్రకటించారు. ఆ తర్వాత నెలలో ఈ కేసును ఎన్ఐఏకు బదలాయించారు. ఎంక్వైరీలో పన్నూన్ యొక్క బ్యాంక్‌ అకౌంట్‌ డీటెయిల్స్, ఫోన్‌ నంబర్లను కనిపెట్టారు. దీంతో సరిపోల్చడానికి యూఎస్ లో ఉన్న ది మ్యూచువల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌ ట్రీటీని భారత్‌ సమాచారం కోరగా.. దీనిని అమెరికన్ పోలీసులు తిరస్కరించారు.

Exit mobile version