NTV Telugu Site icon

Arunachal Pradesh Clash: భారత్-చైనా సరిహద్దు ఘర్షణలపై స్పందించిన అమెరికా..

China, India Border

China, India Border

US Reacted To India-China Border Clash: భారత్, చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో ఇరు దేశాల సైనికులు తలపడ్డారు. ఇరు దేశాల సైనికులు ఈ ఘర్షణల్లో గాయపడ్డారు. అయితే ఈ ఘటనలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించింది. తవాంగ్ ప్రాంతం నుంచి ఇరుదేశాల బలగాలు వైదొలగడంపై బైడెన్ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ వెల్లడించారు. వివాదాస్పద సరిహద్దుపై ఇరు దేశాలు ద్వైపాక్షికంగా చర్చించుకోవాలని సూచించింది అమెరికా. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి వివాదాస్పద ప్రాంతం నుంచి చైనా, భారతదేశాల తమ బలగాలను ఉపసంహరించుకోవాలని కోరారు.

Read Also: Uttar Pradesh: అంత్యక్రియలకు డబ్బు లేక రోజుల తరబడి తల్లి మృతదేహంతోనే..

డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)ని అతిక్రమించకుండా చైనా సైన్యాన్ని భారత ఆర్మీ దళాలు ధైర్యంగా అడ్డుకున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. చైనా దురక్రమణను భారత సైన్యం అడ్డుకుంది. ఈ ఘర్షణల్లో భారత్ తో పోలిస్తే చైనా సైనికులే ఎక్కువగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే ఎప్పటిలాగే చైనా తన వక్రబుద్ధిని బయటపెట్టింది. భారత బలగాలే ముందుగా దురాక్రమణకు పాల్పడటానికి ప్రయత్నించాయని ఆరోపించింది.

జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్, జాట్ రెజిమెంట్, సిక్కు లైట్ ఇన్‌ఫాంట్రీతో సహా మూడు వేర్వేరు బెటాలియన్‌లకు చెందిన దళాలు చైనా దురాక్రమణలను అడ్డుకున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖపై యథాతథస్థితిని మార్చేందుకు చైనా సైనికులు ప్రయత్నిస్తున్న సమయంలో భారత బలగాలు ప్రతిఘటించాయి. క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణలు ఏర్పడ్డాయి. చైనా సైన్యం రాడ్లు, కర్రలతో భారత సైనికులపై దాడికి ప్రయత్నించారు. దీనిని భారత బలగాలు తిప్పికొట్టాయి. 2020 జూన్ లో గాల్వాల్ ఘర్షణల తర్వాత మళ్లీ మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి.