NTV Telugu Site icon

PM Modi US Visit: ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికిన జో బైడెన్.. వైట్‌హౌస్‌లో విందు..

Modi

Modi

PM Modi US Visit: ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. బుధవారం వైట్‌హౌస్‌లో ప్రధాని మోడీకి విందు ఇచ్చారు. వైట్‌హౌస్‌లో ఇరువురు దేశాధినేతలు ఫోటోలకు ఫోజులిచ్చారు. భారదదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంగీతాన్ని ఆస్వాదించినట్లు వైట్ హౌజ్ తెలిపింది.

Read Also: Sada : పొట్టి గౌనులో థైస్ అందాలతో బోల్డ్ ఫోటో షూట్..!

ప్రధాని మోడీకి అధికారిక బహుమతిగా 20వ శతాబ్దం ప్రారంభంలో చేతితో తయారు చేసిన, పురాతన అమెరికన్ బుక్ గ్యాలీని అధ్యక్షుడు జో బైడెన్ అతని సతీమణి జిల్ బైడెన్ అందించనున్నారు. దీంతో పాటు పురాత అమెరికన్ కెమెరాను బహుమతిగా అందచేయనున్నారు. వీటితో పాటు జార్జ్ ఈస్ట్‌మన్ మొదటి కొడాక్ కెమెరాకు సంబంధించిన పేటెంట్ యొక్క ఆర్కైవల్ ఫాక్సిమైల్ ప్రింట్, అమెరికన్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన హార్డ్‌కవర్ పుస్తకాన్ని కూడా బహుమతిగా అందజేస్తారు. మోడీతో వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా, ప్రొటోకాల్ డిప్యూటీ చీఫ్ అసీమ్ వోహ్రా ఉన్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ప్రధానికి ఏర్పాటు చేసిన ప్రైవేట్ డిన్నర్ లో పాస్తా, ఐక్ క్రీం వంటివి ఏర్పాటు చేశారు.

Show comments