కరోనా కాలంలో అనేక మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు సర్జికల్, మెడికేటెడ్ మాస్క్‌లు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు వాటితోపాటుగా గుడ్డ మాస్క్ లు, పారదర్శక మాస్క్‌లు వంటికి కూడా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, కర్ణాటకు చెందిన నితిన్ వ్యాన్ అనే వ్యక్తి పర్యావరణానికి మేలు చేకూర్చే విధంగా పేపర్ సీడ్ మాస్క్ ను తయారు చేశారు. కాటన్ గుడ్డను పల్స్ షీట్‌గా మార్చి 12 గంటలపాటు డ్రై చేసిన అనంతరం దానితో మాస్క్ ను తయారు చేస్తారు. ఈ పేపర్ పల్స్ షీట్‌లో వివిద రకాల కూరగాయల, ఔషద విత్తనాలు ఉంచుతారు. మాస్క్ ను వాడిన తరువాత పడేస్తే ఆ మాస్క్ నుంచి మొక్కలు మొలకెత్తుతాయి. దీని ఖరీరు కేవలం రూ.25 మాత్రమే. ఇండియాలో ఇప్పటికే దీనిని రిలీజ్ చేశారు. ఈ మాస్క్‌పై అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ మీడియా దృష్టిసారించింది. దీనిని తయారు చేసిన నితిన్ వ్యాన్‌ను ఇప్పటికే ఇంటర్యూ చేసింది. అమెరికా మీడియా అసక్తి కనబరచడంతో పేపర్ సీడ్ మాస్క్ కు అంతర్జాతీయంగా ఖ్యాతి లభించింది.