USA: మోడీ-పుతిన్ మీటింగ్.. భారత్‌తో సంబంధాలపై అమెరికా కొత్త నిర్వచనం..
- మోడీ-పుతిన్ భేటీ ముందు అమెరికా నుంచి కొత్త నిర్వచనం..
- భారత్- అమెరికా సంబంధాలపై విదేశాంగ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు..
- 21 శతాబ్ధాన్ని నిర్వచించే సంబంధమని ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. రష్యా అధినేత పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అమెరికా, భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంతో ఈ మూడు దేశాలు మరింత దగ్గర అవుతున్నాయి. పుతిన్, జిన్‌పింగ్‌లతో మోడీ కరచాలనం, ఆత్మీయ ఆలింగనం చూస్తే అమెరికాకు కాలుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, భారత్ తమ నుంచి దూరం కాకుండా ఉండేందుకు ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మోడీ-పుతిన్ భేటీకి కొన్ని నిమిషాల ముందు అమెరికా నుంచి ఈ ప్రకటన వచ్చింది.
Read Also: Uttar Pradesh: సీఎం ఆఫీస్ ముందే మహిళ అంత పని చేసిందా.. అసలేమైందంటే…
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
తాజాగా, అమెరికా-భారత బంధానికి కొత్త నిర్వచనం ఇచ్చింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ.. ‘‘ 21 శతాబ్దాన్ని నిర్వచించే సంబంధం’’గా కొనియాడారు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలు కొత్త శిఖరానికి చేరుకుంటాయని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ, ద్వైపాక్షిక సంబంధాల వరకు, రెండు దేశాల ప్రజల మధ్య శాశ్వత స్నేహమే ఈ ప్రయాణానికి ఇంధనం అని రూబియో అన్నట్లు అమెరికా రాయబార కార్యాలయం ఉటంకించింది.
ట్రంప్ భారత్‌పై సుంకాల విధింపు నేపథ్యంలో ఇప్పుడు భారత్, చైనా, రష్యాల మధ్య సమావేశాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ సమయంలోనే అమెరికా నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ట్రంప్ సుంకాలను భారత్ ఏ మాత్రం పట్టించుకోకుండా, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు భారత్ సహకరిస్తోందని అమెరికా వాదిస్తోంది. అయితే 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతను నిర్ధారిస్తున్నామని భారత్ చెబుతోంది. అమెరికా బెదిరింపులకు లొంగి, దశాబ్ధాల కాలంగా రష్యాతో ఉన్న సంబంధాలను పాడు చేసుకోలేమని భారత్ చెప్పకనే చెబుతోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!