Site icon NTV Telugu

USA: మోడీ-పుతిన్ మీటింగ్‌.. భారత్‌తో సంబంధాలపై అమెరికా కొత్త నిర్వచనం..

Modi Putin

Modi Putin

USA: చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. రష్యా అధినేత పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అమెరికా, భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంతో ఈ మూడు దేశాలు మరింత దగ్గర అవుతున్నాయి. పుతిన్, జిన్‌పింగ్‌లతో మోడీ కరచాలనం, ఆత్మీయ ఆలింగనం చూస్తే అమెరికాకు కాలుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, భారత్‌ తమ నుంచి దూరం కాకుండా ఉండేందుకు ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మోడీ-పుతిన్ భేటీకి కొన్ని నిమిషాల ముందు అమెరికా నుంచి ఈ ప్రకటన వచ్చింది.

Read Also: Uttar Pradesh: సీఎం ఆఫీస్ ముందే మహిళ అంత పని చేసిందా.. అసలేమైందంటే…

తాజాగా, అమెరికా-భారత బంధానికి కొత్త నిర్వచనం ఇచ్చింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ.. ‘‘ 21 శతాబ్దాన్ని నిర్వచించే సంబంధం’’గా కొనియాడారు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలు కొత్త శిఖరానికి చేరుకుంటాయని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ, ద్వైపాక్షిక సంబంధాల వరకు, రెండు దేశాల ప్రజల మధ్య శాశ్వత స్నేహమే ఈ ప్రయాణానికి ఇంధనం అని రూబియో అన్నట్లు అమెరికా రాయబార కార్యాలయం ఉటంకించింది.

ట్రంప్ భారత్‌పై సుంకాల విధింపు నేపథ్యంలో ఇప్పుడు భారత్, చైనా, రష్యాల మధ్య సమావేశాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ సమయంలోనే అమెరికా నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ట్రంప్ సుంకాలను భారత్ ఏ మాత్రం పట్టించుకోకుండా, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్‌ యుద్ధానికి రష్యాకు భారత్ సహకరిస్తోందని అమెరికా వాదిస్తోంది. అయితే 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతను నిర్ధారిస్తున్నామని భారత్ చెబుతోంది. అమెరికా బెదిరింపులకు లొంగి, దశాబ్ధాల కాలంగా రష్యాతో ఉన్న సంబంధాలను పాడు చేసుకోలేమని భారత్ చెప్పకనే చెబుతోంది.

Exit mobile version