Site icon NTV Telugu

US Embassy: “అలాంటి వారు అమెరికాకు వచ్చే హక్కు లేదు”.. భారతీయ విద్యార్థికి సంకెళ్లపై వివరణ..

Us

Us

US Embassy: అమెరికాలోని న్యూవార్క్ విమానాశ్రయంలో భారతీయ విద్యార్థికి అక్కడి అధికారులు చేతికి సంకెళ్లు వేసి, బహిష్కరించిన ఘటన దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై అమెరికా తీరును ప్రవాస భారతీయులతో పాటు, దేశంలోని ప్రజలు ఖండించారు. అయితే, ఈ ఘటనపై భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయం కీలక వ్యాఖ్యలు చేసింది.

అమెరికా చట్టబద్ధమైన ప్రయాణికులను స్వాగతించడం కొనసాగిస్తున్నప్పటికీ, అక్రమ ప్రవేశం, వీసాల దుర్వినియోగం, అమెరికా చట్టాలను ఉల్లంఘించడాన్ని సహించబోమని, అలాంటి వారికి అమెరికా సందర్శించే హక్కు లేదని యూఎస్ ఎంబసీ పేర్కొంది. “యునైటెడ్ స్టేట్స్ మా దేశానికి చట్టబద్ధమైన ప్రయాణికులను స్వాగతిస్తూనే ఉంది. అయితే, చట్టవిరుద్ధమైన వారికి యునైటెడ్ స్టేట్స్‌ను సందర్శించే హక్కు లేదు. అక్రమ ప్రవేశం, వీసాల దుర్వినియోగం, యుఎస్ చట్ట ఉల్లంఘనను మేము సహించము” అని భారతదేశంలోని యుఎస్ రాయబార కార్యాలయం ఎక్స్‌లో రాసింది.

Read Also: Bengaluru stampede case: ఆర్సీబీ తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం.. ప్రభుత్వానికి 9 ప్రశ్నలు..

అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిని నేరస్తుడిగా చూస్తున్నట్లు చేతులకు సంకెళ్లు వేసి, నేలకు నొక్కిపట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వివాదం తలెత్తింది. “నిన్న రాత్రి న్యూవార్క్ విమానాశ్రయం నుండి ఒక యువ భారతీయ విద్యార్థిని బహిష్కరించడం నేను చూశాను – చేతులకు సంకెళ్లు వేశారు, అతను ఏడుస్తున్నాడు, అతడి పట్ల నేరస్థుడిలా ప్రవర్తించాడు. ఒక NRIగా, నేను నిస్సహాయంగా, హృదయ విదారకంగా భావించాను. ఇది ఒక మానవ విషాదం” అని ఓ ఎన్ఆర్ఐ ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

సోషల్ మీడియా యూజర్ కునాల్ జైన్, ఒక సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రకారం, ఆ విద్యార్థి హర్యాన్విలో మాట్లాడుతూ, తాను పిచ్చివాడిని కాదని నొక్కి చెబుతున్నాడు, కానీ అధికారులు అతన్ని అలా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ‘‘ ఈ పిల్లలు వీసాలు పొంది ఉదయం విమానంలో వెళ్తారు. ఏదో ఒక కారణం చేత, వారు ఇమ్మిగ్రేషన్ అధికారులకు తమ సందర్శనకు కారణాన్ని వివరించలేకపోతున్నారు. సాయంత్రం విమానంలో నేరస్థుల వలె కట్టి పంపబడ్డారు. ప్రతిరోజూ ఇలాంటి కేసులు 3-4 జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇలాంటి కేసులు మరిన్ని జరుగుతున్నాయి’’ అని జైన్ అన్నారు.

దీనిపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. ఈ విషయంపై స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నామని చెప్పింది. ముందస్తు నోటీసు లేకుండా వీసాలను రద్దు చేయడం ద్వారా అంతర్జాతీయ విద్యార్థులపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇది జరిగింది.

Exit mobile version