US Embassy: అమెరికాలోని న్యూవార్క్ విమానాశ్రయంలో భారతీయ విద్యార్థికి అక్కడి అధికారులు చేతికి సంకెళ్లు వేసి, బహిష్కరించిన ఘటన దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై అమెరికా తీరును ప్రవాస భారతీయులతో పాటు, దేశంలోని ప్రజలు ఖండించారు. అయితే, ఈ ఘటనపై భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయం కీలక వ్యాఖ్యలు చేసింది.