NTV Telugu Site icon

US-India: అమెరికా వీసాల్లో రికార్డ్.. వరుసగా రెండో ఏడాది 10 లక్షలు జారీ

Usvisa

Usvisa

అమెరికా వీసాల్లో రికార్డ్ సృష్టించింది. వరుసగా రెండో ఏడాది 10 లక్షలకు పైగా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. టూరిజం, బిజినెస్, విద్య, వైద్యం మరియు ఇతర ప్రయోజనాల కోసం అమెరికా వెళ్లడానికి భారతీయుల్లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. దీంతో అమెరికా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు జారీ చేసి రికార్డు సృష్టించింది. వలసేతర వీసాలను జారీ చేసేందుకు అమెరికా సులభతరం చేస్తుంది. ఇందులో భాగంగానే భారీగా వీసాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ USA బుకింగ్స్ ఓపెన్

కోవిడ్ తర్వాత భారతీయ సందర్శకుల సంఖ్యను పెంచుతామని యూఎస్ ఎంబసీ పేర్కొంది. ఇందులో భాగంగా ఏడాదికి ఏడాది వీసాల జారీ సంఖ్యను పెంచుకుంటూ వెళ్తోంది. గత నాలుగు సంవత్సరాల్లో భారతదేశం నుంచి సందర్శకుల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. దాదాపు రెండు మిలియన్లకు పైగా ఆ సంఖ్య ఉంది. 2024లో మొదటి పదకొండు నెలల్లో భారతీయులు యునైటెడ్ స్టేట్స్‌కు ప్రయాణించారు. 2023తో పోల్చుకుంటే 26 శాతం పెరుగుదల ఉందని రాయబార కార్యాలయం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఐదు మిలియన్లకు పైగా భారతీయులు ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్‌ను సందర్శించారని తెలిపింది.

ఇది కూడా చదవండి: MP Mallu Ravi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి

Show comments