Site icon NTV Telugu

US: భారత్ పెట్టుబడుల్ని తెస్తోంది, పాకిస్తాన్ ఏం తెస్తోంది..?

India Us

India Us

US: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రపంచ దేశాలపై టారిఫ్స్‌తో విరుచుకుపడుతున్నారు. ఇండియాపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. మరోవైపు, రేర్ ఎర్త్ ఖనిజాల కోసం పాకిస్తాన్‌తో డీల్ కుదుర్చుకున్నారు. ఇదిలా ఉంటే, ట్రంప్ అవలంభిస్తున్న విధానాలపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు, ట్రంప్‌‌ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు రిచ్ మెక్‌కార్మిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పట్ల ట్రంప్ తీరును తప్పుపట్టారు. భారతదేశం అమెరికాలో పెట్టుబడుతుపెడుతోందని, పాకిస్తాన్ నుంచి ఏం వస్తుందని ప్రశ్నించారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్‌ను దూరం చేయడం మనందరికి పెద్ద సమస్య అని అన్నారు.

Read Also: Reservations: తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి వివరాలు ఇవే..

‘‘పాకిస్తాన్‌లో 300 మిలియన్ల మంది జనాభా ఉన్నారు. కానీ అమెరికాలోకి పెట్టుబడుతు తీసుకురావడం మీరు చూడరు. భారత్ పెట్టుబడుల్ని తీసుకోవడమే కాకుండా, అమెరికాలో సెట్టుబడుల్ని పెడుతోంది’’ అని కార్మిక్ అన్నారు. భారతదేశానికి అపారమైన ప్రతిభ ఉందని, ప్రతిభావంతుల్ని యూఎస్‌కు ఎగుమతి చేస్తోందని ఆయన అన్నారు. ప్రధాని మోడీ ‘‘జాతీయవాది’’ అని పిలిచిన కార్మిక్, భారత్ చౌకైన ఇంధనంతో తన ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి రష్యన్ చమురును కొనుగోలు చేస్తుందని అన్నారు. ఈ విషయంలోనే అమెరికా ద్వేషం పెంచుకుందని చెప్పారు.

మరోవైపు, మరో కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా మాట్లాడుతూ.. యూఎస్ కంపెనీలు పాకిస్తాన్‌లో పెట్టుబడులు పెట్టడం లేదని అన్నారు. అమెరికా, పాక్ మధ్య సంబంధాలు బలపడినప్పటికీ, ఆ దేశంలో యూఎస్ పెట్టుబడులు పెట్టడం లేదని, భారత్ లో పెట్టుబడుల్ని పెడుతోందని అన్నారు.

Exit mobile version