PM Narendra Modi: గుజరాత్‌లోని నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని రాజకీయ అండదండలతో “అర్బన్ నక్సల్స్, అభివృద్ధి నిరోధకులు” చాలా ఏళ్లుగా ఈ డ్యామ్ పర్యావరణానికి హాని కలిగిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తూ పనులను అడ్డుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్‌లోని నర్మదా జిల్లాలోని ఏక్తా నగర్‌లో పర్యావరణ మంత్రుల జాతీయ సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అనంతరం వివిధ రాష్ట్రాల పర్యావరణ మంత్రులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
“అర్బన్ నక్సల్స్, రాజకీయ అండదండలు కలిగిన అభివృద్ధి వ్యతిరేక శక్తులు సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాజెక్టు పర్యావరణానికి హాని కలిగిస్తుందని ప్రచారం చేయడం ద్వారా నిర్మాణాన్ని నిలిపివేశాయి. ఈ ఆలస్యం కారణంగా భారీ మొత్తంలో డబ్బు వృథా అయింది. ఇప్పుడు, డ్యామ్ పూర్తి కావడంతో, వారి వాదనలు ఎంత సందేహాస్పదంగా ఉన్నాయో మీరు బాగా అంచనా వేయగలరు” అని ప్రధాని మోదీ అన్నారు. ఈ అర్బన్ నక్సల్స్ ఇప్పటికీ చురుకుగా ఉన్నారని ప్రధాని అన్నారు. అనేక ప్రాజెక్టులను పర్యావరణం పేరుతో అనవసరంగా నిలిచిపోకుండా చూసుకోవాలని మంత్రులకు ప్రధాని మోడీ సూచించారు. కుట్రను ఎదుర్కోవడానికి సమతుల్య విధానాన్ని కలిగి ఉండాలన్నారు.
Amit Shah: 2024 సార్వత్రిక ఎన్నికల్లో లాలూ-నితీష్ ద్వయం తుడిచిపెట్టుకుపోతుంది..
“అర్బన్ నక్సల్” అనే పదాన్ని తరచుగా రాజకీయ వర్ణపటంలో నక్సలిజం/మావోయిస్ట్ సానుభూతిపరులు, కొంతమంది సామాజిక కార్యకర్తలను వివరించడానికి ఉపయోగిస్తారు. అర్బన్ నక్సల్స్ ఈ మధ్య కాలంలోనే వాడుకలోకి వచ్చినా.. తరచూ వినిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక స్వరానికి పాలకులు పెట్టిన పేరే ఇదని ప్రజాసంఘాలంటున్నాయి. విద్యార్ధులను ఉగ్రవాదం వైపు ఉసిగొలిపే వారే అర్బన్ నక్సల్స్ అని నిఘా వర్గాలంటున్నాయి.
