Site icon NTV Telugu

Uttar Pradesh: భర్తను చంపేందుకు భార్య ప్లాన్.. “అపరిచితుడి” రూపంలో బిగ్ ట్విస్ట్..

Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తన భర్తను చంపేందుకు తన సోదరులతో కలిసి ప్లాన్ చేసింది. దాదాపుగా మరణం అంచులో ఉన్న సదరు వ్యక్తి ఓ అపరిచిత వ్యక్తి మూలంగా రక్షించబడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని బరేలీలో జరిగింది. డాక్టర్ సహాయకుడిగా పనిచేస్తున్న రాజీవ్ అనే వ్యక్తి కాళ్లు, చేతులు విరిగిపోయి, తీవ్రమైన బాధతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Read Also: PM Modi: ట్రంప్ ‘‘డెడ్ ఎకానమీ’’ కామెంట్స్‌కి మోడీ అదిరిపోయే కౌంటర్..

ఇజ్జత్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది. రాజీవ్ భారత్య సాధన, తన ఐదుగురు సోదరులు భగవాన్ దాస్, ప్రేమ్‌రాజ్, హరీష్, లక్ష్మణ్‌తో సహా తన ఐదుగురు సోదరులను హత్య చేయడానికి ఒప్పించింది. దీని కోసం వారు హంతకులను కూడా నియమించుకున్నారు. జూలై 21 రాత్రి, మొత్తం 11 మంది రాజీవ్‌ను అతని ఇంట్లో దాడి చేశారు. వారు అతని చేయి మరియు రెండు కాళ్ళు విరిచారు. అతన్ని సజీవంగా పాతిపెట్టాలనేది వారి ప్లాన్. దీని కోసం అతడిని సీబీ గంజ్ ప్రాంతంలోని అడవిలోకి తీసుకెళ్లి, పాతిపెట్టడానికి గోయ్యిని కూడా సిద్ధం చేశారు.

అయితే, ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వారు రాజీవ్‌ను పాతిపెట్టే సమయంలోనే అక్కడి ఓ అపరిచితుడు వచ్చాడు. దీంతో నిందితులంతా ఒక్కసారిగా తమ ప్లాన్‌ను పక్కనపెట్టి పారిపోయారు. రాజీవ్ నొప్పితో సహాయం కోసం పెద్దగా అరిచాడు. ఆ అపరిచితుడు అతడిని గమనించి అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. రాజీవ్ తండ్రి నేత్రమ్ తన కోడలు, ఆమె సోదరులు తన కొడుకును చంపాలని ప్లాన్ చేసినట్లు ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. రాజీవ్ బరేలీలోని నవోదయ ఆసుపత్రిలో ఒక వైద్యుడి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అతను 2009లో సాధనను వివాహం చేసుకున్నాడు మరియు ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Exit mobile version