Triple Talaq: అనారోగ్యంతో బాధపడుతున్న తన సోదరుడికి కిడ్నీ దానం చేసిన మహిళకు, ఆమె భర్త వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సదరు మహిళ భర్త సౌదీ అరేబియాలతో పనిచేస్తుండగా.. భార్య ఉత్తర్ ప్రదేశ్ లోని బైరియాహి గ్రామంలో ఉంటోంది. మహిళ సోదరుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతుండటంతో అతడిని రక్షించేందుకు ఆమె తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఆమె తీసుకున్న ఈ నిర్ణయమే ఆమె వివాహాన్ని విచ్ఛిన్నం చేసింది.
కిడ్నీ దానం గురించిన సమాచారాన్ని తన భర్తకు తెలియజేసిన వెంటనే.. అతను వాట్సాప్ మెసేజ్ ద్వారా ఆమెకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. మహిళ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. 2019లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ చట్ట, రాజ్యంగ విరుద్ధమని ప్రకటించింది.
Read Also: Loan App: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి
ముస్లిం మహిళల హక్కుల కోసం కేంద్రం ట్రిపుల్ తలాక్‌ని నిషేధించింది. ఎవరైనా తన భార్యకు ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇస్తే నేరంగా పరిగణించబడుతుంది. నిందితుడికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తుంది. ముందుస్తు బెయిల్ ఇవ్వడానికి ముందు ఫిర్యాదు చేసిన మహిళను కోర్టు విచారిస్తే, అటువంటి కేసుల్లో బెయిలు మంజూరుకు ఎలాంటి అడ్డంకులు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది.