NTV Telugu Site icon

Candy Crush: “క్యాండీ క్రష్” గేమ్‌కి బానిసైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. ఎలా తెలిసిందంటే..

Candy Crush

Candy Crush

Candy Crush: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ‘‘క్యాండీ క్రష్’’ మొబైల్ గేమ్‌కి బానిసగా మారాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా అదే పనిగా తన ఫోన్‌లో గేమ్ ఆడుతున్నట్లు విచారణలో తేలింది. డ్యూటీ సమయంలో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్ రాజేంద్ర పన్సియా పాఠశాలను సందర్శించిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యాదృచ్ఛికంగా పాఠశాలను తనిఖీ చేసిన సమయంలో విద్యార్థుల పుస్తకాల్లో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చాలా తప్పుల్ని గుర్తించారు. దీంతో లోతుగా విచారించగా క్యాండీ క్రష్ విషయం వెలుగులోకి వచ్చింది.

Read Also: BMW Hit-And-Run: యాక్సిడెంట్‌కి ముందు 12 లార్జ్ విస్కీ పెగ్గులు తాగిని నిందితుడు మిహిర్‌షా..

ఉపాధ్యాయుడి ఫోన్ తనిఖీ చేయగా, అందులోని ఒక ఫీచర్ అతను ఏఏ యాప్స్‌ని ఎక్కువగా వాడుతున్నాడనే విషయాన్ని వెల్లడించింది. క్యాండీ క్రష్ గేమ్ కోసం గంటల తరబడి సమయాన్ని వెచ్చించినట్లు తేలింది. పాఠశాల విధుల సమయంలో క్యాండీ క్రష్ ఆడటానికి దాదాపు రెండు గంటలు గడిపినట్లు తేలింది. ‘‘ఉపాధ్యాయులు విద్యార్థుల క్లాస్‌వర్క్ మరియు హోంవర్క్‌లను తనిఖీ చేయడంపై దృష్టి పెట్టాలి మరియు వారికి నాణ్యమైన విద్య అందేలా చూడాలి. అలాగే, మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం సమస్య కాదు, కానీ పాఠశాల సమయంలో వ్యక్తిగత కారణాల కోసం వాటిని ఉపయోగించడం సరికాదు’’ అని కలెక్టర్ చెప్పారు.

కలెక్టర్ పన్సియా ఆరుగురు విద్యార్థుల కాపీలను చెక్ చేగా, 95 తప్పుల్ని గుర్తించారు, వీటిలో 9 తప్పులు మొదటి పేజీలోనే ఉన్నాయి. దీంతో అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ అసిస్టెంట్ టీచర్ ప్రియమ్ గోయల్ ఫోన్ తనిఖీ చేశారు. టీచర్ ఫోన్లోని వెల్‌బీయింగ్ ఫీచర్ ద్వారా ఐదున్నర గంటల పాఠశాల విధుల్లో ప్రియమ్ గోయల్ రెండు గంటల పాటు క్యాండీ క్రష్, 26 నిమిషాలు ఫోన్లో మాట్లాడటం, 30 నిమిషాలు సోషల్ మీడియాను ఉపయోగించినట్లు తేలింది. జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని గ్రహించి రాష్ట్ర విద్యాశాఖకు సమచారం అందించడంతో, వారు అతడిని సస్పెండ్ చేశారు.