Zia Ur Rehman Barq: విద్యుత్ దొంగతనం.. సమాజ్‌వాదీ ఎంపీకి చుక్కలు చూపిస్తున్న యోగి సర్కార్..
- విద్యుత్ చౌర్యం కేసులో ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్..
- సంభాల్ అల్లర్లలో కూడా నిందితుడిగా పేరు..
- విద్యుత్ చోరీ కేసులో రూ. 1.9 కోట్ల జరిమానా విధించిన యోగి సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zia Ur Rehman Barq: విద్యుత్ చౌర్యం కేసులో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్‌పై యూపీ విద్యుత్ శాఖ కేసు నమోదు చేశారు. నవంబర్ నెలలో సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వే సమయంలో అధికారులపై దాడులు చేసిన ఘటనలో రెహ్మాన్ బార్క్ నిందితుడుగా ఉన్నాడు. అప్పటి నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్, ఆ ప్రాంతంలోని ఆక్రమణలను తొలగిస్తోంది. ఆ ప్రాంతంలో విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వ్యక్తులపై కేసులు పెడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ఇంటికి కూడా మీటర్ లేదని యూపీ అధికారులు గుర్తించారు. యూపీ విద్యుత్ శాఖ బార్క్‌ని 15 రోజుల్లో రూ. 1.9 కోట్లు జరిమానా చెల్లించాలని లేదా ప్రాపర్టీని అటాచ్‌మెంట్ చేయాలని కోరింది.
Read Also: PM Modi: నా కుటుంబం కోసమే రోజుకు 12 గంటలు పని చేస్తున్నా.. మోడీ కీలక వ్యాఖ్యలు
Also Read
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
- Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్‌తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
సంభాల్‌లోని దీపా సరాయ్ పరిసరాల్లోని జియా ఉర్ రెహ్మాన్ బార్క్ నివాసంలో విద్యుత్ చౌర్యం జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుత్ మీటర్ ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాల నేపథ్యంలో గురువారం విద్యుత్ శాఖ భారీ బందోబస్తుతో బార్క్ నివాసంలో సోదాలు నిర్వహించింది. తనిఖీల్లో రెండు విద్యుత్ మీటర్లలో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో ఏసీలు, సీలింగ్ ఫ్యాన్లు, ఇతర విద్యుత్ ఉపకరణాలు ఉన్నా గత ఏడాది విద్యుత్ బిల్లు మాత్రం జీరోగా వచ్చినట్లు తేలింది. విద్యుత్ శాఖ ఎంపీ నివాసంలో పాత మీటర్లను తొలగించింది, వీటిని లాబోరేటరీకి పంపించింది.
ఈ కేసులో సమాజ్‌వాదీ ఎంపీ తండ్రి మమ్లుక్ ఉర్ రెహ్మాన్ బార్క్‌పై నఖాసా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. తనఖీల సమయంలో విద్యుత్ అధికారుల్ని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 352, 351(2), మరియు 132 కింద కేసులు బుక్ అయ్యాయి.
తాజావార్తలు
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..