UP News: పంటకు పురుగులమందు చల్లిన తర్వాత చేతులు కడుక్కోవడానికి నిరాకరించిన రైతు మరణించిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ మథురలో జరిగింది. 27 ఏళ్ల యువ రైతు తన పొలంలో పంటకు పురుగుల మందు చల్లిన తర్వాత, చేతులు కడుక్కోకుండా రాత్రి భోజనం చేశాడు. ఆ తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురై మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. శనివారం రాత్రి ఆలస్యంగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
Read Also: EPFO ATM Card: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు!
కన్హయ్య(27) అనే యువరైతు వ్యవసాయ పొలాల్లో పురుగుల మందు చల్లడానికి శనివారం వెల్లాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అతడి భార్య పట్టు చేతులు కడుక్కోవాలని ఎంతగా పట్టుపట్టినప్పటికీ, అతడు వినకుండా చేతులు కడగకుండానే భోజంన చేశాడని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ రంజనా సచన్ తెలిపారు. రాత్రి భోజనం తర్వాత కన్హయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి వేగంగా దిగజారడంతో, ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడు మరణించినట్లు ప్రకటించారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అధికారులకు అప్పగించారు.