UP Elections: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..

  • 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ హీట్
  • తాజా సర్వేలో మళ్లీ బీజేపీదే అధికారం అని అంచనా
  • 267 స్థానాల్లో బీజేపీ, 132 స్థానాల్లో ఎస్పీ గెలుస్తుందని ప్రిడిక్షన్
Yogi

Yogi

UP Elections: 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పొలిటికల్ హీట్ మొదలైంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ(ఎస్పీ)లు తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీనే దేశంలో అధికారం చేపడుతుందనే అభిప్రాయం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా యూపీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే, తాజాగా న్యూస్ లీడర్ లైవ్- మాట్రిజ్ న్యూస్ కమ్యూనికేషన్ నిర్వహించిన సర్వేలో యూపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని అంచనా వేసింది. మొత్తం 403 స్థానాలకు గానూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 267 స్థానాలు గెలుచుకుంటుందని, సమాజ్‌వాదీ+కాంగ్రెస్ పార్టీల కూటమి 132 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేసింది. బీఎస్పీ రెండు, ఇతరులు రెండు స్థానాల్లో గెలుస్తారని చెప్పింది.

ఉత్తర్ ప్రదేశ్‌లోని 4 రీజియన్లలో బీజేపీ క్లియర్ కట్ మెజారిటీ సాధిస్తుందని చెప్పింది. వెస్ట్రన్ యూపీలో 136 స్థానాలకు గానూ బీజేపీ 93, ఎస్పీ 43 స్థానాలు గెలుచుకుంటాయని చెప్పింది. అవధ్ రీజియన్‌లోని 118 స్థానాలకు గానూ బీజేపీ 77, ఎస్పీ కూటమి 40, బీఎస్పీ 01, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని 19 స్థానాలకు గానూ బీజేపీ 17, ఎస్పీ 2, పూర్వాంచల్‌లో 130 స్థానాలకు గానూ బీజేపీ 130, ఎస్పీ 47, బీఎస్పీ 01, ఇతరులు 02 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది.