NTV Telugu Site icon

UP Cop: ‘‘బంగాళాదుంపలు’’ లంచంగా కోరిన ఎస్‌ఐ.. ట్విస్ట్ ఏంటంటే..

Potatos

Potatos

UP Cop: ఉత్తర్ ప్రదేశ్ కన్నౌజ్‌కి చెందిన ఓ ఎస్ఐ లంచం కోరిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకు ఆయన ఏం కోరాడంటే.. తనకు లంచంగా ‘‘5 కిలోల బంగాళాదుంపలు’’ కావాలని బాధితుడిని అడిగారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లంచానికి కోడ్ పదంగా ‘‘బంగాళాదుంపల్ని’’ ఉపయోగించాడు.

Read Also: Matrimony cheat: మ్యాట్రిమోని సైట్లలో తాను మోసపోయానని.. అందమైన యువతుల ప్రొఫైల్స్‌ పెట్టి.?

రామ్ కృపాల్ సింగ్ అనే పోలీస్ సారిఖ్ స్టేషన్ పరిధిలోని భావల్ పూర్ చపున్నా చౌకీలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ కేసును పరిష్కరించే విషయంలో బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేశారు. ఎస్ఐ ఒక రైతు నుంచి 5 కిలోల ‘‘బంగాళాదుంపలు’’ లంచంగా కావాలని కోరాడు, అయితే రైతు 2 కిలోలు ఇచ్చాడు. దీంతో ఆగ్రహించిన ఎస్‌ఐ తన డిమాండ్‌ని రైతు ముందుంచాడు, చివరకు 3 కిలోలలకు ఒప్పందం కుదరింది. ఈ సంభాషణలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డబ్బుల కోసం బంగాళాదుంపల్ని కోడ్ నేమ్‌గా వాడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఎస్ఐ‌ని సస్పెండ్ చేస్తూ కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుపై శాఖాపరమైన విచారణ కూడా చేపట్టారు. ఎస్ఐని దోషిగా తేల్చి, కన్నౌజ్ సీఐ కమలేష్ కుమార్‌కి కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.

Show comments