Site icon NTV Telugu

Nitin Gadkari: 2 రోజులు ఢిల్లీలో ఉండలేకపోయా.. కాలుష్యంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

Nitin Gadkari

Nitin Gadkari

ఢిల్లీ కాలుష్యంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులు ఢిల్లీలో ఉండలేకపోయాయని.. గొంతు ఇన్ఫెక్షన్‌కు గురైందని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో బాధపడుతోందని.. దీనికి 40 శాతం తన రంగానికి సంబంధించిన సమస్యేనని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. భారతదేశం శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడటాన్ని తప్పుపట్టారు.

ఇది కూడా చదవండి: Bangladesh: ఉస్మాన్ హాదీని ప్రభుత్వమే చంపింది.. బాధిత సోదరుడు సంచలన ఆరోపణలు

‘‘శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకోవడానికి భారతదేశం ప్రతి సంవత్సరం దాదాపు రూ. 22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని.. శిలాజ ఇంధనాల వాడకాన్ని మనం తగ్గించుకోలేమా? ఇది ఎలాంటి దేశభక్తి? శిలాజ ఇంధనాలు కారణంగా కాలుష్యం పెరుగుతోంది. సున్నా కాలుష్యానికి కారణమయ్యే ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్-శక్తితో నడిచే వాహనాలను మనం ఎందుకు ప్రోత్సహించలేము?.’’ అని వ్యాఖ్యానించారు.

గత కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో ఇబ్బంది పడుతోంది. స్వచ్ఛమైన గాలి లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటున్నా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: Silver Rates: వామ్మో.. సిల్వర్‌‌కు ఏమైంది?.. రికార్డ్ స్థాయిలో పెరిగిన వెండి ధర

Exit mobile version