Site icon NTV Telugu

Nitin Gadkari: నేనొక్కడినే ఎందుకు తిట్లు తినాలి? నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Nitin Gadkari

Nitin Gadkari

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన రోడ్లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన రహదారులపై క్యూఆర్ కోడ్ స్కానర్లను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. ‘‘స్మార్ట్ రోడ్ల భవిష్యత్తు-భద్రత’’ అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో గడ్కరీ ప్రసంగించారు.

ఇది కూడా చదవండి: Modi-Trump: ‘‘అందమైన వ్యక్తి.. చాలా కఠినుడు’’ దక్షిణ కొరియా టూర్‌లో మోడీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

దేశంలో రోడ్లు ఎక్కడ బాగోలేక పోయినా తననే తిడుతున్నారని.. వ్యవస్థ చేసిన తప్పునకు తానెందుకు తిట్లు తినాలని.. సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ చమత్కరించారు. అందుకోసమే రోడ్లకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియజేసేందుకు క్యూఆర్ కోడ్‌లను తీసుకొస్తామని చెప్పారు. రోడ్లపైన స్కానింగ్ బోర్డులు ఏర్పాటు చేస్తామని.. స్మార్ట్‌ ఫోన్‌లో స్కాన్ చేయగానే రోడ్డుకు సంబంధించిన సమాచారం వచ్చేస్తుందన్నారు. రోడ్లు ఎవరు వేశారు?.. కాంట్రాక్టర్ ఎవరు? ఎవరెవరు పనులు చేశారో వాళ్ల సమాచారం.. ఫోన్ నెంబర్లతో సహా వచ్చేస్తుందని.. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. రోడ్లు బాగోలేకపోతే తననే కాకుండా.. కాంట్రాక్టర్‌ను.. రోడ్లు వేసిన వాళ్లందరిని తిడతారని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Chennai: చెన్నైలో దారుణం.. మహిళపై అత్యాచారం చేసి బైక్ టాక్సీ డ్రైవర్ పరార్

రోడ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడే అధికారులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రోడ్లపై ఏదైనా సమస్య వస్తే.. నేరుగా అధికారులనే ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంటుందని చెప్పారు. అందుకోసమే రోడ్లపై స్కానర్లు ఏర్పాటు చేస్తామని.. అందులోనే ఫోన్ నెంబర్లతో సహా అన్ని వివరాలు వచ్చేస్తాయని పేర్కొన్నారు. రోడ్ల గురించిన సమాచారం ప్రజలకు తెలిస్తే.. ఎలాంటి ఇబ్బందులు ఉండవని గడ్కరీ చెప్పుకొచ్చారు.

 

 

Exit mobile version