Site icon NTV Telugu

Nitin Gadkari: సహచర మంత్రిని టీజ్ చేసిన నితిన్ గడ్కరీ

Gadkari

Gadkari

Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగాల్లో పలు సందర్భాల్లో చమత్కరాలు వినిపిస్తుంటాయి. తాజాగా సహచర మంత్రిని ఉద్దేశించి సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మా ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వస్తుందో, లేదో చెప్పలేం.. కానీ, రాందాస్‌ అథవాలే మంత్రి అవుతారన్న గ్యారంటీ మాత్రం కచ్చితంగా ఉందని గడ్కరీ అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు. దాంతో అక్కడున్న వారందరు చిరునవ్వులు చిందించారు. అప్పుడు ఆ వేదికపై రాందాస్ అథవాలే కూడా ఉన్నారు. తోటి మంత్రిని టీజ్‌ చేసి.. జస్ట్ జోక్ చేస్తున్నాను అని నితీన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు.

Read Also: Mulugu: క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో స్థానికులు..

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) నేత అథవాలే.. వరుసగా మూడుసార్లు మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోసారి బీజేపీ విజయం సాధిస్తే.. తన పరంపరను కొనసాగిస్తాననే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో ఆర్‌పీఐ కూడా కొనసాగుతుంది. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రకు త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. రాందాస్ అథవాలే పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీలో ఉంది.

Exit mobile version