Bihar Bridge Collapse: బిహార్‌లో అందుకే బ్రిడ్జ్‌లు కూలిపోతున్నాయి: కేంద్రమంత్రి
- బిహార్ లో వరుసగా కూలిపోతున్న వంతెనలు..
- బ్రిడ్జ్ లు కూలిపోవడంతో సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి జితన్ రామ్..
- రుతుపవనాల వల్లే.. భారీ వర్షాలు పడటంతోనే బ్రిడ్జ్‌లు కూలిపోతున్నాయి: కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Bridge Collapse: బీహార్ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా వరుసగా బ్రిడ్జ్‌లు కూప్పకూలిపోతున్నాయి. కేవలం 17 రోజుల వ్యవధిలోనే దాదాపు 12 వంతెనలు కూలిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ఇచ్చిన వివరణ నివ్వెరపరుస్తోంది. ఇది రుతుపవనాల టైం.. ప్రస్తుతం రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో వర్షాలు కురవడం వల్లే.. బ్రిడ్జ్‌లు కూలడానికి కారణం అని చెప్పుకొచ్చారు. ఈ ఘటనలపై దర్యాప్తు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్‌గానే ఉన్నారు అని తెలిపారు. వెంటనే దర్యాప్తు చేసి.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని కేంద్రమంత్రి వెల్లడించారు.
Read Also: TGSRTC MD Sajjanar: సిటీ బస్సులో మహిళకు ప్రసవం చేసిన లేడీ కండక్టర్.. సజ్జనార్ ట్వీట్..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
కాగా, ఇప్పటి వరకు శివన్, సరన్, కృష్ణగంజ్, మధుబాణి, అరారియా, ఈస్ట్ చంపారన్ జిల్లాల్లో వరుసగా బ్రిడ్జులు కూలిపోయాయి. ఈ పరిణామాలు రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. దీనికి సీఎం నీతీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వమే జవాబుదారీ వహించాలని ఆర్జేడీ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ విమర్శల సమయంలో.. రాష్ట్రంలోని అన్ని పాత వంతెనలపై సర్వే చేసి.. తగిన మరమ్మతులు చేయాలంటూ నితీశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారని ఉప ముఖ్యమంత్రి చౌదరి చెప్పారు. వంతెనల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను తయారు చేయాలని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు.
Read Also: Somu Veerraju: 8న రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు.. ఏపీ అభివృద్ధే ప్రధాన ఎజెండా..
అయితే, భారీ వ్యయంతో నిర్మించిన వంతెనలు స్వల్ప వ్యవధిలోనే కూలిపోతుండటం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ.. వంతెనల పూడికతీత పనులను దక్కించుకున్న కంట్రాక్టర్, నిర్వహణ పనులను పర్యవేక్షించే ఇంజినీర్లే ఈ ఘటనలకు కారణమని ప్రాథమిక రిపోర్టులో తేలిందని చెప్పారు. గుత్తేదారులకు అప్పగించిన పనులను సరిగ్గా నిర్వర్తించలేదు.. అదే సమయంలో ఇంజినీర్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే.. వరుసగా వంతెనలు కూలిపోతున్నాయని సూచించారు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!