NTV Telugu Site icon

Bihar Bridge Collapse: బిహార్లో అందుకే బ్రిడ్జ్లు కూలిపోతున్నాయి: కేంద్రమంత్రి

Bihar

Bihar

Bihar Bridge Collapse: బీహార్‌ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా వరుసగా బ్రిడ్జ్‌లు కూప్పకూలిపోతున్నాయి. కేవలం 17 రోజుల వ్యవధిలోనే దాదాపు 12 వంతెనలు కూలిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేంద్ర మంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ ఇచ్చిన వివరణ నివ్వెరపరుస్తోంది. ఇది రుతుపవనాల టైం.. ప్రస్తుతం రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో వర్షాలు కురవడం వల్లే.. బ్రిడ్జ్‌లు కూలడానికి కారణం అని చెప్పుకొచ్చారు. ఈ ఘటనలపై దర్యాప్తు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్‌గానే ఉన్నారు అని తెలిపారు. వెంటనే దర్యాప్తు చేసి.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని కేంద్రమంత్రి వెల్లడించారు.

Read Also: TGSRTC MD Sajjanar: సిటీ బస్సులో మహిళకు ప్రసవం చేసిన లేడీ కండక్టర్.. సజ్జనార్ ట్వీట్..

కాగా, ఇప్పటి వరకు శివన్‌, సరన్‌, కృష్ణగంజ్‌, మధుబాణి, అరారియా, ఈస్ట్‌ చంపారన్‌ జిల్లాల్లో వరుసగా బ్రిడ్జులు కూలిపోయాయి. ఈ పరిణామాలు రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. దీనికి సీఎం నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ప్రభుత్వమే జవాబుదారీ వహించాలని ఆర్జేడీ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ విమర్శల సమయంలో.. రాష్ట్రంలోని అన్ని పాత వంతెనలపై సర్వే చేసి.. తగిన మరమ్మతులు చేయాలంటూ నితీశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారని ఉప ముఖ్యమంత్రి చౌదరి చెప్పారు. వంతెనల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను తయారు చేయాలని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు.

Read Also: Somu Veerraju: 8న రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు.. ఏపీ అభివృద్ధే ప్రధాన ఎజెండా..

అయితే, భారీ వ్యయంతో నిర్మించిన వంతెనలు స్వల్ప వ్యవధిలోనే కూలిపోతుండటం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్‌ మాట్లాడుతూ.. వంతెనల పూడికతీత పనులను దక్కించుకున్న కంట్రాక్టర్, నిర్వహణ పనులను పర్యవేక్షించే ఇంజినీర్లే ఈ ఘటనలకు కారణమని ప్రాథమిక రిపోర్టులో తేలిందని చెప్పారు. గుత్తేదారులకు అప్పగించిన పనులను సరిగ్గా నిర్వర్తించలేదు.. అదే సమయంలో ఇంజినీర్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే.. వరుసగా వంతెనలు కూలిపోతున్నాయని సూచించారు.