Site icon NTV Telugu

Bihar: హిజాబ్ లాగితే తప్పేముంది? నితీష్ కుమార్‌ను వెనకేసుకొచ్చిన కేంద్రమంత్రి

Bihar

Bihar

బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వేదికపై ఓ ముస్లిం వైద్యురాలి హిజాబ్ తొలగించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో విపక్షాలు, నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. ఈ వ్యవహారం రాజకీయంగా చాలా దుమారమే చెలరేగింది.

తాజాగా నితీష్ కుమార్ చర్యను కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సమర్థించారు. ఎవరైనా అపాయింట్‌మెంట్ లెటర్ తీసుకునేందుకు వస్తే ముఖం చూపించేందుకు ఎందుకు భయపడాలని ప్రశ్నించారు. ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు కూడా ముఖం చూపించాల్సిన అవసరం లేదా? అని గిరిరాజ్‌సింగ్ నిలదీశారు. నితీష్ కుమార్.. హిజాబ్‌ను తీయమని చెప్పడంలో ఏం తప్పుందని అడిగారు.

ఇది కూడా చదవండి: World Richest Families: ప్రపంచ ధనికుల కుటుంబం లిస్ట్ విడుదల.. అంబానీకి ఎన్నో ర్యాంక్ అంటే..!

ఇక నితీష్ కుమార్ చర్యను మైనారిటీ సంక్షేమ మంత్రి జామా ఖాన్ కూడా సమర్థించారు. ముస్లిం కుమార్తెపై నితీష్ కుమార్ ప్రేమ చూపించారని.. జీవితంలో విజయం సాధించిన అమ్మాయి ముఖం సమాజం చూడాలని కోరుకోవడంలో తప్పేముందన్నారు. తాజాగా కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ కూడా నితీష్ కుమార్ చర్యను సమర్థిస్తూ.. అందులో ఏం తప్పుందని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Maharashtra: ‘రమ్మీ’ మంత్రి మాణిక్‌రావ్ కోకటే‌కు మళ్లీ ఇక్కట్లు.. పదవికి రాజీనామా

కొత్తగా నియమితులైన ఆయుష్ వైద్యుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, మంత్రులు విజయ్ కుమార్ చౌదరి, మంగళ్ పాండే పాల్గొన్నారు. వేదికపైన నియామక పత్రాలు అందజేస్తుండగా ఒక ముస్లిం వైద్యురాలు హిజాబ్ ధరించుకుని వచ్చింది. నితీష్ కుమార్ పత్రాన్ని అందజేసే క్రమంలో వైద్యురాలి హిజాబ్‌ను తొలగించాలని కోరారు. కానీ అంతలోనే ఆమె హిజాబ్‌ను కిందకు గట్టిగా లాగే ప్రయత్నం చేశారు. ఈ హఠాత్తు పరిణామంతో వైద్యురాలు షాక్‌కు గురైంది. అంతేకాకుండా వేదిక దగ్గర ఉన్న నాయకులు, అధికారులు కూడా ఆశ్చర్యపోవడం వంతైంది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రవర్తనపై విపక్షాలు మండిపడ్డాయి. నితీష్ కుమార్ మానసిక పరిస్థితి దయనీయ స్థితికి చేరిందని.. 100 శాతం సంఘీగా మారిపోయారంటూ ఆర్జేడీ విమర్శించింది. అలాగే కాంగ్రెస్ కూడా మండిపడింది. ఇది నీచమైన చర్య అని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేస్తే.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించింది. ఈ నీచత్వం క్షమించరానిది అని.. వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

 

Exit mobile version