Site icon NTV Telugu

Reena Paswan: రాజ్యసభకు కేంద్రమంత్రి తల్లి? ఏ రాష్ట్రం నుంచంటే..!

Reena Paswan

Reena Paswan

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక బీహార్‌లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభకు తన తల్లిని పంపించాలని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఖాళీ అయ్యే ఐదు స్థానాల్లో తల్లి రీనా పాశ్వాన్‌ను రాజ్యసభకు పంపించే అవకాశం ఉన్నట్లు వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇది కూడా చదవండి: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో ఇదేం జాడ్యం.. వీడియో వైరల్

2020లో కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. అప్పటి నుంచి రీనా పాశ్వాన్ ను రాజ్యసభకు పంపించాలని ప్రయత్నాలు జరిగినట్లుగా తెలుస్తోంది. కానీ సాధ్యం కాలేదు. అయితే ఈసారి మాత్రం రీనా పాశ్వాన్‌ను కుమారుడు చిరాగ్ పాశ్వాన్ పంపించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Israel: వెస్ట్ బ్యాంక్‌లో కూలిన ఇజ్రాయెల్ హెలికాప్టర్.. వీడియో వైరల్

ఏప్రిల్‌లో ఆర్జేడీకి చెందిన ప్రేమ్‌చంద్ గుప్తా, ఏడీ సింగ్, జేడీయూకు చెందిన హరివంశ్, రామ్‌నాథ్ ఠాకూర్, రాష్ట్రీయ లోక్ మోర్చాకు చెందిన ఉపేంద్ర కుష్వాహా పదవీ కాలం ముగియనుంది. ఈ ఖాళీ అయ్యే స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరిగే ఛాన్సుంది. అయ్యే ఖాళీ అయ్యే స్థానాలకు గట్టి పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక రీనా పాశ్వాన్ రాజ్యసభకు వెళ్లే అంశాన్ని తిరస్కరించినట్లుగా వర్గాలు తెలిపాయి. ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version