Site icon NTV Telugu

Amit Shah: రాష్ట్రాలకు అమిత్ షా కీలక ఆదేశాలు.. తక్షణమే పాకిస్థానీయులను పంపేయాలని సూచన

Amitshah

Amitshah

కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి వెంటనే పంపించేయాలని ఆదేశించారు. ఇప్పటికే పాకిస్థాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసింది. దీంతో చాలా మంది అటారీ-వాఘా సరిహద్దు దగ్గరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమిత్ షా ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. అధికారులు.. పాకిస్థానీయుల కోసం జల్లెడ పడుతున్నారు.

ఇది కూడా చదవండి: Vinay Narwal: పహల్గామ్ బాధితుడు నేవీ ఆఫీసర్ భార్యపై నీచంగా ట్రోలింగ్.. ఒకరు అరెస్ట్

మంగళవారం పహల్గామ్‌లో ఉగ్రమూకల దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్దీ గాయపడ్డారు. ఈ ఘటనలో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. పాకిస్థాన్‌పై కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే సింధు జలాలను నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ-వాఘా సరిహద్దును మూసేసింది.

ఇది కూడా చదవండి: Khawaja Asif: ’30 ఏళ్లుగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాం’.. నిజం ఒప్పుకున్న పాక్ రక్షణ మంత్రి…

Exit mobile version