ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు, ఉగ్రవాదానికి గట్టి బుద్ధి చెప్పినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌లో హాట్‌హాట్‌గా చర్చ మొదలైంది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు. మతం పేరుతో పర్యాటకుల్ని చంపారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టే ముందు భారత సైన్యం చాలా జాగ్రత్తలు తీసుకుందని.. పాకిస్థాన్‌లో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాడులు చేసినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను ఆక్రమించుకోవడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదన్నారు. బాధితులకు జరిగిన అన్యాయానికి ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రతీకారం తీర్చుకున్నట్లు చెప్పారు. పాక్ న్యూక్లియర్ బాంబ్ బెదిరింపులను భారత్ ఏ మాత్రం ఖాతర చేయలేదని తేల్చిచెప్పారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ సత్తా ఏంటో ప్రపంచమంతా చూసిందన్నారు.
ఇది కూడా చదవండి: MLC Nagababu: నాకు పదవుల మీద ఆశ లేదు.. కానీ..!
మే 7న భారత సైన్యం తన శక్తి, సామర్థ్యాలను చూపిందన్నారు. వంద మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారన్నారు. ఏడు ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారని.. కేవలం 22 నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తి చేశారని వివరించారు. దేశ ప్రజలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ సైన్యం మనపై దాడికి దిగిందన్నారు. కానీ పాక్ దాడులను మనం సమర్థంగా తిప్పికొట్టినట్లు వివరించారు. పాక్ దాడులను మన రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టిందని వివరించారు. భారత్ చేపట్టిన దాడులను అనేక దేశాలు సమర్థించాయని గుర్తుచేశారు. సరిహద్దులు దాటి వెళ్లడం… ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదని.. కేవలం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సంస్థలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యం అని తెలిపారు.ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడమే లక్ష్యమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ఇది కూడా చదవండి: Mithun Reddy Mother Emotional: రాజమండ్రి జైలు వద్ద కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ మిథున్ రెడ్డి తల్లి..
