ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని మోడీ ఇటీవల రెండు దేశాల పర్యటనకు వెళ్లొచ్చారు. ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. వాణిజ్య యుద్ధం ప్రకటించారు. దీనిపై ప్రధాని మోడీ చర్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. ట్రంప్ నిర్ణయాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Swathi Reddy: పాన్ ఇండియా ఆఫర్ కొట్టేసిన కలర్స్ స్వాతి..?
ప్రస్తుతం ఇండియా వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తోంది. ఆ దిశగా కేంద్రం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజా సమావేశంలో కూడా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Minister Seethakka: కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్