Delhi: పేదలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 2028 వరకు ఉచిత బియ్యం పంపిణీ
- న్యూట్రిషన్ సెక్యూరిటీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
- రూ. 17082 కోట్లు కేటాయింపు.. 80 కోట్ల మందికి లబ్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూట్రిషన్ సెక్యూరిటీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూట్రిషన్ సెక్యూరిటీ కోసం కేంద్రం రూ. 17,082 కోట్లు కేటాయించింది. వంద శాతం కేంద్రం నిధులు కేటాయించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయింది. అనంతరం అశ్విని వైష్ణవ్ వివరాలు మీడియాకు తెలియజేశారు. మహిళలు, పిల్లల్లో న్యూట్రిషన్ సమస్యలను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్ల తెలిపారు. 80 కోట్ల మందికి న్యూట్రిషన్ సెక్యూరిటీ ద్వారా లబ్ధి పొందనున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Heroines: రూట్ మార్చిన హాట్ బ్యూటీస్… దెబ్బకు షేక్ చేస్తున్నారే!
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
ఇక 2028 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పేదలకు ఉచితంగా బియ్యం/ఆహారధాన్యాలు అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని కేంద్రం పొడిగించింది. 2028 డిసెంబరు వరకు ఉచిత బియ్యం పంపిణీకి ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ. 17,082 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..
రూ. 17,082 కోట్లతో ఫోర్టిఫైడ్ రైస్ సరఫరాకు ఆమోదం
ఐసీడీఎస్, పీఎం పోషన్ సహా అన్ని పథకాల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా
రక్త హీనత, శరీరంలో మైక్రో-న్యూట్రియంట్ల కొరతను అధిగమించడమే లక్ష్యం
2024 జులై నుంచి 2028 డిసెంబర్ వరకు అమలు కానున్న పథకం
పూర్తిగా 100 శాతం కేంద్ర నిధులతోనే పథకం అమలు
దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ప్రయోజనం
పోషకాహార లోపాన్ని అధిగమించే అవకాశం
నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయం
గుజరాత్‌లోని లోథల్ దగ్గర ఏర్పాటు కానున్న హెరిటేజ్ కాంప్లెక్స్
రూ. 4,406 కోట్లతో రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో సరిహద్దు రోడ్ల అభివృద్ధి
వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం కింద రోడ్లు, టెలీకాం, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య అందించే ప్రయత్నం
2,280 కి.మీ మేర రాజస్థాన్, పంజాబ్‌లో కొత్త రోడ్ల నిర్మాణం
పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో సరిహద్దు గ్రామాలకు కనెక్టివిటీ
హైవేతో అనుసంధానం చేయడం ద్వారా సరిహద్దు గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు
#WATCH | Delhi: After the Union Cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, "…PM Modi has emphasized the development of infrastructure in border areas. Today cabinet approved construction of 2,280 km of roads with an investment of Rs 4,406 crore in the border areas… pic.twitter.com/8D3jPUvN6x
— ANI (@ANI) October 9, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!