పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక ఆధారంగా వక్ఫ్ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిన చాలా మార్పులను కేంద్రం చేర్చినట్లుగా సమాచారం. సవరణలు చేసిన బిల్లును ఫిబ్రవరి 19న కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ బిల్లును బడ్జెట్ సమావేశాల రెండో విడతలో భాగంగా బిల్లుపై చర్చించి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. తొలి విడత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే దీనిపై ఫిబ్రవరి 13న ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అనంతరం బిల్లులో కొన్ని సవరణలు చేసి కేబినెట్ ఆమోదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: IMD Warning: పలు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఢిల్లీలో కమ్ముకున్న మేఘాలు
వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను క్రమబద్ధీకరించడం ఈ బిల్లు యొక్క లక్ష్యం. అయితే జేపీసీ నివేదిక నుంచి అసమ్మతి సూచనలను తొలగించారని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. అయితే ఈ బిల్లును గత వారమే కేంద్రం ఆమోదించిందని వర్గాలు పేర్కొన్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఈ బిల్లుకు మార్గం సుగమం అవుతుందని కేంద్రం భావిస్తోంది. అయితే దీనిపై పోరాడేందుకు ప్రతిపక్షాలు కూడా సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Telugu Language: ప్రయాగ్‌రాజ్‌లో తెలుగు భాషకు గౌరవం