Union Budget 2026: ఉద్యోగాలపై AI ప్రభావం.. అధ్యయనానికి ప్యానెల్..

  • సర్వీస్ సెక్టార్‌లో ఉపాధిపై ఏఐ ఎఫెక్ట్..
  • అధ్యయనానికి ప్యానెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం..
  • బడ్జెట్‌లో ప్రకటించిన నిర్మలాసీతారామన్..
Budget

Budget

Union Budget 2026: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026లో సేవా రంగంలో ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు ఇతర లేటెస్ట్ టెక్నాలజీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై అంచనా వేయడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 2047 నాటికి ప్రపంచ సర్వీస్ సెక్టార్ లో 10 శాతం వాటా సాధించే లక్ష్యాన్ని భారత్ పెట్టుకుంది. ఇందులో భాగంగా ఐటీ, ఫైనాన్స్, పర్యాటక, ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్‌తో పాటు ఇతర రంగాల్లో ఏఐ, ఆటోమేషన్, డిజిటర్ ట్రాన్స్‌ఫర్మెషన్ మొదలైనవి ఉపాధిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే దానిపై ప్యానెల్ అధ్యయనం చేస్తుంది.

Read Also: Union Budget 2026: రైతుల చేతికి AI ఆయుధం.. వ్యవసాయం కోసం కొత్త పథకం!

వికసిత భారత్ విధానాలకు అనుగుణంగా భారత్ దీర్ఘకాలిక వ్యూహాలు, వృద్ధికి అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ మార్గాలు, విధానపరమైన అవసరాలను ఈ ప్యానెల్ సిఫారసు చేస్తుందని భావిస్తున్నారు. మరోవైపు, వ్యవసాయ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం ఏఐ-ఆధారిత సాధనాలను ప్రారంభించాలని ప్రతిపాదించింది.