NTV Telugu Site icon

US Intelligence: పాకిస్తాన్ కవ్విస్తే అంతే.. మోదీ హయాంతో భారత్ సైనికంగా స్పందించే అవకాశం..

Pm Modi

Pm Modi

US Intelligence Report: అమెరికా ఇంటెలిజెన్స్ భారత్, పాక్ సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. అమెరికా ఇంటెలిజెన్స్ ఆన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ ప్రకారం.. పాకిస్తాన్ ఏదైనా కవ్వింపుచర్యలకు పాల్పడితే సైనికంగా ప్రతిస్పందించేందుకు భారతదేశం గతం కన్నా ఎక్కువ అవకాశం ఉందని వెల్లడించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో సైన్యం ధీటుగా స్పందించే అవకాశం ఉందని తెలిపింది. భారత్, పాకిస్తాన్ రెండు అణ్వాయుధ దేశాలుగా ఉన్నందుకు వీటి మధ్య సంక్షోభం మరింత తీవ్రంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. గతంలో భారత వ్యతిరేక ఉగ్రసంస్థలకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి చిన్న ఘటన అటువైపు నుంచి వచ్చిన ప్రతిస్పందించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు నివేదిక అంచానా వేసింది.

Read Also: Surprise Gift: సర్ ప్రైజ్ గిఫ్ట్ అంటే ఇదేనా.. కళ్లు మూసుకోమని కత్తితో కోసేశాడు

రెండు దేశాల మధ్య పెరుగుతున్న సంక్షోభం ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొంది. కాశ్మీర్ లో హింసాత్మక అశాంతి, భారత్ లో మిలిటెంట్ల దాడులు ఇరు దేశాల మధ్య ప్రమాదాన్ని పెంచుతున్నాయని అభిప్రాయపడింది. అంతర్గత సంఘర్షణ, దేశ అస్థిరత, ఇతర పాలనా సవాళ్లు స్వదేశంలో, విదేశాల్లో అమెరికా ప్రయోజనాలకు, దాని మిత్రదేశాలకు ప్రత్యక్ష, పరోక్ష సవాళ్లు కలిగిస్తాయని తెలిపింది.

మరోవైపు భారత్-చైనాల వివాదాస్పద సరిహద్దులో పెరుగుతున్న సైనిక కార్యకలాపాలు ఇరు దేశాల మధ్య సాయుధ ఘర్షణ ప్రమాదాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది. 2020లో ఇరు దేశాల మధ్య ఘర్షణ నేపథ్యంలో సంబంధాలు దెబ్బతిన్నాయని నివేదిక పేర్కొంది. ఇది దశాబ్ధకాలంలో అత్యంత తీవ్రంగా ఉందని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్-రష్యా యుద్ధం పేదరికాన్ని పెంచి, ఆర్థిక వృద్ధికి ఆటకం కలిగించిందని నివేదిక తెలిపింది.