NTV Telugu Site icon

Sam Pitroda: దక్షిణాది ప్రజలపై వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా..

Sam Pitroda

Sam Pitroda

Sam Pitroda: కాంగ్రెస్ సీనియర్ నేత, ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ తన పదవకి రాజీనామా చేశారు. ఆయన చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు భారతదేశం వ్యాప్తంగా వివాదాస్పదం కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ఇండియా కూటమి టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. ఇంటాబయట విమర్శలు వెల్లువెత్తడంతో పిట్రోడా రాజీనామా చేశారు.

శామ్ పిట్రోడ్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయగా, ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు. శామ్ పిట్రోడా రాజీనామా చేసిన విషయాన్ని పార్టీ నాయకుడు జైరాం రమేష్ ఎక్స్ ద్వారా వెల్లడించారు.

Read Also: PM Modi: శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్.. డీఎంకేకి కాంగ్రెస్‌తో పొత్తు తెంచుకునే దమ్ముందా..?

ఈశాన్య భారతంలో ప్రజలు చైనీయులుగా, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లుగా, ఉత్తరాదివారు తెల్లగా, పశ్చిమాన ఉన్న వారు అరబ్బులుగా కనిపిస్తారు అని శామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ తీరును ప్రధాని విమర్శిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అతని వ్యాఖ్యలకు దూరంగా ఉంది, ఈ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఇండియా కూటమి కూడా ఈ వ్యాఖ్యల్ని సమర్థించదని ఆప్ నేత సంజయ్ సింగ్ పేర్కొన్నారు.