NTV Telugu Site icon

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులకు అవకాశం.. తమ పౌరులకు యూకే జాగ్రత్త..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని యూకే హెచ్చరించింది. తమ పౌరులు ఆ దేశానికి ప్రయాణించకుండా హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం యూకే ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ‘‘రద్దీగా ఉండే ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలు వంటి వాటిలో పాటు విదేశీ పౌరులు సందర్శించే ప్రదేశాలతో సహా తీవ్రవాద దాడులు విచక్షణారహితంగా జరగవచ్చు’’ అని యూకే తెలిపింది.

బంగ్లాదేశ్‌లో ఇటీవల కాలంలో మైనారిటీలపై , ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ క‌ృష్ణదాస్‌పై ఆ దేశం దేశద్రోహ కేసు పెట్టి, అరెస్ట్ చేసింది. అతడికి బెయిల్ కూడా మంజూరు చేయలేదు. ఆయన తరపు వాదించే లాయర్లపై మతోన్మాదులు దాడికి తెగబడుతున్నారు. తాజాగా ఆయన తరుఫు వాదించే ఓ హిందూ లాయర్‌పై దాడి చేయడంతో ఆయన చావుబతుకుల మధ్య ఉన్నాడు. మరోవైపు చిట్టగాంగ్ బార్ అసోసియేషన్‌లో ముస్లిం న్యాయవాదులు, హిందూ న్యాయవాదుల్ని బెదిరిస్తున్నారు.

Read Also: Dulkar Salman : మళ్లీ తెలుగోడి డైరెక్షన్లోనే.. దుల్కర్ సల్మాన్ తో రొమాన్స్ చేయనున్న బుట్టబొమ్మ

ఈ నేపథ్యంలోనే యూకే తన పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ‘‘కొన్ని సమూహాలు ఇస్లాంకు విరుద్ధమైన అభిప్రాయాలు, జీవనశైలి కలిగిన వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకున్నాయి. మైనారిటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో ఐఈడీ దాడులు ఉన్నాయి. బంగ్లాదేశ్ అధికారులు ప్లాన్డ్ అటాక్స్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’’అని యూకే అడ్వైజరీలో చెప్పింది.

బంగ్లాదేశ్ హిందూ వ్యతిరేక హింసపై యూకే ఆందోళన వ్యక్తం చేసింది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఎంపీ మంగళవారం హౌజ్ ఆఫ్ కామన్స్‌లో చెప్పారు. ఈ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే యూకే ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. “ప్రసిద్ధ హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణ దాస్‌ను దేశద్రోహ ఆరోపణలపై అరెస్టు చేసిన తర్వాత భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిన విషయం మాకు తెలుసు. UK ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (FCDO) డెస్క్ ఆ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది” అని ఎంపీ కేథరీన్ వెస్ట్ చెప్పారు.

Show comments