Site icon NTV Telugu

Maharashtra: అంధేరీ ఉపఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే వర్గం భారీ విజయం

Shiv Sena, Uddhav

Shiv Sena, Uddhav

Uddhav Thackeray’s shock to BJP.. Huge lead in by-elections: శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోగా.. బీజేపీ, ఏక్ నాథ్ షిండే అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత మహారాష్ట్రలో తొలిసారిగా ఉప ఎన్నిక జరుగుతోంది. శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే మరణంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ సీటు నుంచి ఉద్ధవ్ ఠాక్రే శివసేన తరఫున లత్కే భార్య రుతుజా లత్కే బరిలో నిలిచారు.

ప్రస్తుతం ఆమె భారీ విజయం సాధించింది. భారీ మెజారిటీ దక్కించుకున్నారు. ముందుగా ఈ సీటు నుంచి  బీజేపీ తరపున ముర్జీ పటేల్ నిలుచుందాం  అని అనుకున్నా.. చివరకు పోటీ నుంచి తప్పుకోవడంతో రుతుజా లత్కే విజయం దాదాపుగా ఖరారైంది.  ఉద్దవ్ ఠాక్రే శివసేన అభ్యర్థికి కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా మద్దతు ఇచ్చాయి. 66,247 ఓట్లను సాధించారు లత్కే. ఆమె తర్వాతి స్థానంలో 12 వేల ఓట్లతో నోటా నిలిచింది.

Read Also: T20 World Cup: పాక్ బౌలర్ల ధాటికి బంగ్లా విలవిల.. పాక్ ముందు స్వల్ప లక్ష్యం

ముంబై కార్పొరేషన్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ గెలుపు అధికార కూటమిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అధికారం కోల్పోయి, పార్టీ చీలిపోయి ఉన్న ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఈ గెలుపు కొత్త బూస్ట్‌ను ఇవ్వబోతోంది. ఈ గెలుపుతో కార్యకర్తలపై విశ్వాసాన్ని పెంచే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిల్లో బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి.

Exit mobile version