UDAN Scheme 2.0: దేశంలో కొత్తగా 100 ఎయిర్‌పోర్టులు, 200 హెలిప్యాడ్స్..
- దేశంలో కొత్తగా 100 ఎయిర్‌పోర్టులు, 200 హెలిప్యాడ్స్..
- ఉడాన్ 2.0కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UDAN Scheme 2.0: రాబోయే పదేళ్లలో విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే చర్యల్లో భాగంగా కేంద్ర మంత్రి వర్గం ప్రతిష్టాత్మక ప్రణాళికలకు ఓకే చెప్పింది. బుధవారం రూ. 28,840 కోట్ల మొత్తం వ్యయంతో ఉడాన్ పథకాన్ని అప్‌డేట్ చేసింది. సవరించిన ఉడాన్ 2.0 పథకాన్ని 2026-27 నుంచి 2035-36 వరకు అమలు చేయనున్నారు. రాబోయే 8 ఏళ్లలో రూ. 12,159 కోట్ల మూలధన వ్యయంతో, ప్రస్తుతం సేవలు అందని ఎయిర్‌స్ట్రిప్‌లను ఆధునీకరించడం ద్వారా 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయడమే లక్ష్య్ంగా పెట్టుకున్నారు.
ఈ ప్రణాళిక ద్వారా ముఖ్యంగా కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీని పెంచనున్నారు. ఇందులో భాగంగా కొత్తగా 200 ఆధునిక హెలిప్యాడ్స్‌ను అభివృద్ధి చేయనున్నారు. దీని కోసం ఒక్కోక్కటికి రూ.15 కోట్లు వ్యయం చేయనున్నారు. కఠినమైన ప్రాంతాల్లో అత్యవసర సేవలు, ఆరోగ్య సంరక్షణ అందించే లక్ష్యంతో 8 ఏళ్లలో రూ. 3661 కోట్లు కేటాయించారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
సుదూర ప్రాంతాల్లో కార్యకలాపాలకు అవసరమైన చిన్న విమానాల కొరతను తీర్చడానికి స్వదేశీ విమానాల కొనుగోలుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా పవన్ హన్స్ కోసం రెండు హెచ్‌ఏఎల్ ధ్రువ్ హెలికాప్టర్లు, అలయన్స్ ఎయిర్ కోసం రెండు హెచ్‌ఏఎల్ డోర్నియర్ విమానాలు కేటాయించారు. విమానయాన సంస్థలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ‘వయబిలిటీ గ్యాప్ ఫండింగ్’ (VGF) కింద రూ. 10,043 కోట్లు కేటాయించారు. దీనివల్ల మారుమూల ప్రాంతాలకు కూడా తక్కువ ధరకే విమాన టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
2016లో ప్రారంభించిన ఉడాన్ పథకం ద్వారా, 2026 ఫిబ్రవరి వరకు 95 విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, వాటర్ ఏరోడ్రోమ్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద 3.41 లక్షల విమాన సర్వీసులు సేవలు అందించాయి. మొత్తం 1.62 కోట్ల ప్రయాణికులు ప్రయాణించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!