Congress: రూ. 2000 నోట్ల రద్దును ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగింది. ఈ చర్య ‘‘స్వయం శైలి విశ్వగురువు’’, ‘‘ఫస్ట్ యాక్ట్, సెకండ్ థింక్’’( మొదట చేసి, తర్వాత ఆలోచించడం) అతని పద్ధతి అని విమర్శించింది.2016 నవంబర్ 8న నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి విపత్తుకు నాంది పలికారని కాంగ్రెస్ పార్టీ కీలక నేత జైరాం రమేష్ అన్నారు. ప్రధానిని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో ఆరోపించారు.
Read Also: RBI website crash: రూ. 2,000 నోటు రద్దు తర్వాత RBI వెబ్‌సైట్ క్రాష్
2016 నవంబర్ 8 ప్రకటనను ‘‘తుగ్లక్ ఫర్మానా’’గా అభివర్ణించారు. ఆ సమయంలో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన రూ. 2000 నోట్లను ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నారని ఆయన అన్నారు. ‘‘సెకండ్ డెమో డిజాస్టర్ స్టార్.. M = మ్యాడ్ నెస్’’ అంటూ మాణికం ఠాగూర్ ట్వీట్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ₹ 2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. నోట్లను సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చని తెలిపింది.