కర్ణాటకలో హిజాబ్ వ్యవహారంపై చిచ్చు రేపుతోంది.. రాష్ట్రంలోని కొన్ని కళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై నిషేధం విధించడం రచ్చగా మారింది.. ఈ నేపథ్యంలో బెంగళూరులోని విద్యా సంస్థల దగ్గర సమావేశాలు, నిరసనలపై రెండు వారాల పాటు నిషేధం విధించారు.. హిజాబ్ వ్యవహారంలో వరుస నిరసనల నేపథ్యంలో.. తరగతి గదుల్లో హిజాబ్ ధరించే హక్కుపై మితవాద గ్రూపులు ముస్లిం బాలికలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించడంతో కర్ణాటకలో నిరసనలు తీవ్రమయ్యాయి.. ఇది కాస్తా ఇతర కళాశాలలకు వ్యాపించాయి… కర్నాటకలోని పాఠశాలలు మరియు కళాశాలల్లో హిజాబ్‌లపై నిరసనలు, ఆందోళనలు, ఘర్షణల నేపథ్యంలో బెంగళూరులో రెండు వారాల పాటు విద్యా సంస్థల దగ్గర అన్ని సమావేశాలు మరియు నిరసనలను నిషేధించారు.
Read Also: Vijayashanti: కేసీఆర్ పక్కా హిందూ వ్యతిరేకి..! కేవలం వాటికోసమే యాగాలు..!
కాగా, కర్ణాటకలో నిరసనల మధ్య, మితవాద గ్రూపులు తరగతి గదులలో హిజాబ్ ధరించే హక్కుపై ముస్లిం బాలికలను టార్గెట్ చేశాయి.. విద్యార్థుల నిరసనలు మరిన్ని కళాశాలలకు వ్యాపించడంతో పోలీసులు రాళ్లు రువ్వడం, ఘర్షణకు దిగడం వంటి ఘటనలు మంగళవారం నివేదించబడ్డాయి.. శాంతి మరియు సామరస్యాన్ని కాపాడటానికి.. అన్ని విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సూచించారు. మరోవైపు.. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.. తదుపరి తీర్పు వచ్చే వరకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్లకు ఉపశమనం లభించలేదు. తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వలేదు న్యాయస్థానం.. కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ ఇవాళ ఇచ్చిన ఆదేశాల్లో ఈ పిటిషన్లపై విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.. విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్‌ను ధరించేందుకు అనుమతి ఇవ్వడానికి తాత్కాలిక ఆదేశాలను జారీ చేయడంపై కూడా విస్తృత ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.. కాగా, కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం రాష్ట్ర సరిహద్దులు దాటి బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలో మంగళవారం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ నిన్న తాను హిజాబ్ నిషేధానికి మద్దతిస్తున్నానని, పాఠశాలల్లో డ్రెస్ కోడ్‌కు తాను మద్దతిస్తున్నానని చెప్పినప్పటికీ, విద్యాసంస్థల్లో హిజాబ్‌లను నిషేధించే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది.
