కేరళలో ఇటీవల ఒక జీవితఖైదు అత్యంత కట్టుదిట్టమైన సెంట్రల్ జైలు నుంచి పరారయ్యాడు. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే ఖైదీ దొరికిపోయాడు. కానీ ఎలా తప్పించుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. ఇక ఈ ఘటన మరువక ముందే ఒడిశాలో కూడా ఇద్దరు దొంగలు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నారు. పోలీసుల కళ్లు గప్పి చాకచక్యంగా దొంగలు తప్పించుకున్నారు. స్టేషన్ నుంచి దొంగలు పరారవ్వడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్‌కు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వేట ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Delta Airlines: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
దొంగతనం కేసులో అనుమానితులుగా కృష్ణ సాహూ, సూర్యకాంత మొహంతిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌లో పెట్టారు. పూరి జిల్లాలోని గోప్ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరూ కూడా వాష్ రూమ్‌లోని స్కైలైట్ ద్వారా తప్పించుకున్నారు. ఈ స్టేషన్ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు 52 కి.మీ దూరంలో ఉంది. అయితే భద్రతా లోపం కారణంగానే ఇద్దరు దొంగలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. బర్త్‌డే జరుపుకుంటున్న వ్యక్తిని కత్తితో పొడిచి హత్య
జనరల్ స్టోర్‌లో ఇద్దరూ కూడా దొంగతనం చేశారు. ఈ కేసులో ప్రశ్నించడం కోసం ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో పెట్టారు. స్టేషన్ లోపల ఒక బెంచ్ మీద కూర్చోబెట్టారు. అంతేకాకుండా ఇద్దరిపై పలు కేసులు కూడా ఉన్నాయి. విచారణకు సిద్ధపడుతున్న తరుణంలో ఇద్దరు కూడా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు షిఫ్ట్ మారే సమయంలో వాష్‌రూమ్ నుంచి తప్పించుకున్నారు. ఆ సమయంలో ఒక అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ డ్యూటీలో ఉన్నారు. ఖైదీలను పర్యవేక్షించడం సహా ఇతర విధుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనిపించింది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.