Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అల్-ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ గజ్వతుల్ హింద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు. ఫయాజ్ కుమార్, ఒవైస్ ఖాన్ అనే ఉగ్రవాదులు పలు దాడుల్లో పాల్గొన్నారని వారు తెలిపారు. “అనంతనాగ్‌లోని థాజివారా, బిజ్‌బెహరా ప్రాంతంలో అనంత్‌నాగ్ పోలీసులు ఓ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టారు” అని పోలీసు ప్రతినిధి ట్వీట్‌లో తెలిపారు.
Central Govt: వచ్చే రెండేళ్లలో ఆ ప్రవేశ పరీక్షలను విలీనం చేసే ప్రతిపాదన లేదు..
ఉగ్రవాదులు అన్సార్ గజ్వతుల్ హింద్ (ఏజీయూహెచ్)తో సంబంధం కలిగి ఉన్నారని కశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.” అన్సార్ గజ్వతుల్ హింద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఫయాజ్ కుమార్, ఒవైస్ ఖాన్‌లు హతమయ్యారు. వారు జులై 3న చీనివూడర్ శ్రీగుఫ్వారాలో పోలీసు సిబ్బందిపై దాడితో సహా పలు ఉగ్రదాడుల్లో పాల్గొన్నారు. ఇందులో పోలీసు అధికారి ఫిర్దౌస్ దార్ తీవ్రంగా గాయపడ్డారు. ఆగస్టు 12న బిజ్‌బెహరాలో చేసిన దాడిని పోలీసు అధికారి జీహెచ్ ఖాదిర్ తీవ్రంగా గాయపడ్డారు.” అని ఏడీజీపీ విజయ్‌కుమార్ ట్వీట్ చేశారు. జూన్ 15న పాద్‌షాహీ బాగ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడిలో వారు పాల్గొన్నారని ఆయన అన్నారు.
