Site icon NTV Telugu

Kerala: ఇన్సూరెన్స్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

Fireaccident

Fireaccident

కేరళలోని తిరువనంతపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పప్పనంకోడ్‌లోని ఇన్సూరెన్స్ కార్యాలయంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. ఇద్దరు మహిళలు చనిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు వదిలినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Viral Video: అభిమానికి పెద్ద గిఫ్ట్ ఇచ్చిన లులూ గ్రూప్ యజమాని.. వీడియో వైరల్

పాపనంకోడ్ జంక్షన్ సమీపంలోని న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఏజెన్సీ కార్యాలయంలో మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒకరిని ఏజెన్సీ ఉద్యోగి వైష్ణవి (35)గా గుర్తించగా.. మరో మహిళ ఆచూకీ తెలియలేదు. రెండు మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయని, అగ్నిమాపక సిబ్బంది భవనంపై నుంచి బయటకు తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు.

ఇది కూడా చదవండి: UP: లక్నోలో దారుణం.. కదులుతున్న కారులో మోడల్‌పై గ్యాంగ్‌రేప్

మంటలు చెలరేగకముందే పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు సమాచారం అందించారు. అలాగే సమీపంలోని దుకాణ యజమానులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పినప్పటికీ కార్యాలయం పూర్తిగా దెబ్బతింది. కార్యాలయం లోపల నుంచి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

అగ్నిమాపక శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత మొత్తం విషయాలు వెల్లడవుతాయని చెప్పారు.

ఇది కూడా చదవండి: CS Shanti Kumari: ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలి..

Exit mobile version